మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చేశారు. దీనికి రెండు కారణాలున్నాయి. రేఖా, ప్రసాదూ అంటూ చిరంజీవి, నయనతార ఇద్దరూ పలరించుకునే ప్రోమో మీద కొంచెం నెగిటివిటీ వచ్చింది. అది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్ సాంగ్ వదిలేయాలి. అనిల్ రావిపూడి అదే చేశారు. రెండో రీజన్ డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రోమో ఒకటి వదలాలి. సో రెండింటి మధ్య కొంచెం గ్యాప్ అవసరం కాబట్టి ఈ సాంగ్ కాస్త ముందుకు జరిపారు. చెప్పిన టైంకి ఆలస్యం కాకుండా ఆన్ లైన్లో స్ట్రీమ్ అయిపోయింది.
ఇక పాట విషయానికి వస్తే అనిల్ రావిపూడి స్టయిల్ లో క్యాచీగా వెళ్ళిపోయింది. బాగా డబ్బున్న అమ్మాయిని ఒక మధ్య తరగతి అబ్బాయి ప్రేమించడం, తన లవ్ వ్యక్తపరుచుకునే క్రమంలో కష్టాలు చెప్పుకోవడం, దానికామె సంతోషంగా ఒప్పుకోవడం ఇలా సింపుల్ కాన్సెప్ట్ తో వెళ్ళిపోయింది. అనంత శ్రీరామ్ ఈజీ పదాలతో సాహిత్యం సమకూర్చిన విధానం బాగుంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో పాటు మధుప్రియ ఆలపించిన ఈ గీతం చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. మీసాల పిల్ల తరహాలోనే శశిరేఖా, ఓ ప్రసాదూ అంటూ రీల్స్ చేయబోయే జంటలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపించబోతున్నాయి
ఫీడ్ బ్యాక్ పరంగా చూసుకుంటే వాద్యాల హోరు లేకుండా భీమ్స్ కంపోజ్ చేసిన ట్యూన్ అచ్చం మీసాల పిల్ల తరహాలోనే స్లో పాయిజన్ అయ్యేలా ఉంది. డెబ్భై ఏళ్ళ వయసులో కూడా తన గ్రేస్ మైంటైన్ చేయడానికి కష్టపడుతున్న చిరంజీవిని చూస్తే ఫ్యాన్స్ కి కన్నుల పండగ అనేలా ఉంది, విజువల్స్ లొకేషన్స్ అన్నీ సహజంగా ఉన్నాయి. ఈ రోజు నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. సంక్రాంతి విడుదలలో ఎలాంటి మార్పులు లేకుండా చెప్పిన టైంకి రావడానికి టీమ్ పక్కా ప్లానింగ్ తో ఉంది. బాలన్స్ ఉన్న పాటలు ఈ నెలాఖరులోగా రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది.
This post was last modified on December 7, 2025 12:59 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…