ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల గుండెల్లో పిడుగు పడేలా రాత్రి ప్రీమియర్లు క్యాన్సిల్ కావడం యావత్ ఎగ్జిబిటర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. 14 రీల్స్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఇంకా కొలిక్కి రాని కారణంగా సమయానికి షోలు వేయలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. ప్రొడక్షన్ హౌస్ నుంచి రద్దు గురించి మాత్రమే నోట్ వచ్చింది కానీ ఇంకెలాంటి వివరాలు లేవు. ఏపీలో ఇప్పటికే అమ్మేసిన లక్షలాది టికెట్లకు రీ ఫండ్ ప్రాసెస్ మొదలైపోయింది. నేరుగా కొన్నవాళ్ళకు డబ్బులు ఇవ్వనున్నారు.
ఇది హఠాత్ పరిణామం. బాలకృష్ణ లాంటి అగ్ర హీరో నటించిన సినిమాకు ఎదురవ్వాల్సిన స్థితి కాదు. ఒక ప్రణాళికతో ఇంత కష్టపడి ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చి, నార్త్ లోనూ పబ్లిసిటీ చేశాక ఇలా చివరి నిమిషంలో ఆటలు లేవంటే దాని తాలూకు నష్టం మాములుగా ఉండదు. అసలే ప్రీమియర్ల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకుని 600 రూపాయల చొప్పున ఏపీలో అమ్మారు. ఇప్పుడా రెవిన్యూ అంతా పోయినట్టే. ఒకవేళ రేపు ఉదయం నుంచి మొదలుపెట్టినా సాధారణంగా అనుమతించిన రేట్లకే పెట్టాలి కాబట్టి ఓవరాల్ ఓపెనింగ్ లో తీవ్ర కోత పడనుంది.
ఇక తర్వాతి అడుగు రేపు ఉదయం షెడ్యూల్ చేసిన 7 గంటల నుంచి మొదలవ్వాల్సిన ఆటలు. ఇది కూడా ఫైనాన్సియల్ క్లియరెన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంతర్గత వర్గాలు అంటున్నాయి. నిర్మాతల వైపు సాంకేతిక కారణాలు చెబుతున్నా నిజానిజాలు ఏంటనేది కొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి ఇలా జరగకుండా ఉండాల్సిందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో వారాల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు హౌస్ ఫుల్స్స్ తో కళకళలాడతాయని ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా జరగడం ముమ్మాటికీ విచారించాల్సిన విషయం.
This post was last modified on December 4, 2025 7:06 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…