Movie News

నా కేసు క్లోజ్ చెయ్యడానికి 25 ఏళ్ళా… స్టార్ హీరో అసహనం

90వ దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి పేలుళ్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు దాచిపెట్టిన కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ అరెస్టవడం.. ఆ కేసు సుదీర్ఘ కాలం విచారణ దశలో ఉండడం.. కొన్నేళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకుని 2016లో సంజయ్ దత్ విడుదల కావడం తెలిసిందే. ఈ కేసును పాతికేళ్ల పాటు విచారించడం పట్ల సంజయ్ దత్ అసహనం వ్యక్తం చేశాడు.

తన దగ్గర ఆయుధాలు లేకపోయినా దోషిగా ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించానన్నాడు. తన ఇంట్లో ఒక్క తుపాకీ కూడా దొరక్కపోయినా తనను అరెస్ట్ చేశారని.. తన దగ్గర ఆయుధాలు లేవని నిరూపించడానికి 25 ఏళ్లు పట్టిందని దత్ ఆవేదన వ్యక్తం చేశాడు. జైలు జీవితాన్ని ఒక పాఠంగా భావించి.. అక్కడ ఎంతో నేర్చుకున్నట్లు సంజయ్ దత్ తెలిపాడు. 

‘‘నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని తేల్చడానికి 25 ఏళ్లు ఎందుకు పట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నా దగ్గర తుపాకీ ఉందని భావించి నన్ను అరెస్ట్ చేశారు. కానీ అది నిరూపించలేకపోయారు. నా జీవితంలో జరిగిన విషయాలకు ఇప్పుడు బాధ పడడం లేదు. కానీ నా తల్లిదండ్రులు నన్ను విడిచి త్వరగా వెళ్లిపోయారనే బాధ మాత్రం ఉంది.

నేను జైలు జీవితాన్ని ఒక పాఠంగా భావించా. ఎంతో హుందాగా ఎదుర్కొన్నాను. అక్కడ ఉన్నన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. మత గ్రంథాలు చదివాను. న్యాయశాస్త్రం మీద అధ్యయనం చేశా. చట్టాల గురించి ఎంతో నేర్చుకున్నా. నా కేసును త్వరగా పరిష్కరించాలని ఎన్నోసార్లు అభ్యర్థించా. ఎంతోమంది చేయని నేరాలకు జైళ్లలో మగ్గుతున్నారని తెలుసుకున్నా’’ అని సంజయ్ దత్ చెప్పాడు.

This post was last modified on December 3, 2025 3:44 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

10 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago