Movie News

బైకర్ సౌండ్ లేదు… మురారి ఆగడం లేదు

శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే అఖండ 2 వచ్చిన మరుసటి రోజు డిసెంబర్ 6 బైకర్ రిలీజయ్యేది. కానీ సాంకేతిక కారణాలు చూపుతూ యువి క్రియేషన్స్ వాయిదా వేసింది. కొత్త డేట్ డిసెంబర్ 12 లేదా 18 అంటున్నారు. దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ క్లారిటీ లేదు. ఒకవేళ వీటిలో ఒక తేదీ కన్ఫర్మ్ అనుకుంటే ప్రమోషన్లు ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. కానీ ఆ ఊసే వినిపించడం లేదు. ఆపై డిసెంబర్ 25 మళ్ళీ పోటీ ఎక్కువగా ఉంది. ఛాంపియన్, శంబాలా అంటూ చెప్పుకోదగ్గ కాంపిటీషన్ కనిపిస్తోంది.

సరే బైకర్ సంగతలా ఉంచితే చాపకింద నీరులా సంక్రాంతి బరిలో నారి నారి నడుమ మురారి దిగడం దాదాపు పక్కా అయ్యేలా ఉంది. అధికారికంగా పోస్టర్ ద్వారా ఈ విషయం గతంలోనే చెప్పారు కానీ కాంపిటీషన్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాయిదా వార్తలు లేకపోలేదు. అయితే నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియాలో పాత సంక్రాంతి క్లాషులు మీకు గుర్తున్నాయా, అప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయో అంటూ ట్వీట్లు పెట్టడం శతమానం భవతి, ఎక్స్ ప్రెస్ రాజా విజయాలను గుర్తు చేస్తున్నాయి. ఈ రెండు శర్వానంద్ సినిమాలే కాబట్టి ఇప్పుడు నారి నారి నడుమ మురారి పండగకు వచ్చే సంకేతాన్ని నేరుగా ఇస్తున్నారు.

రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, జన నాయకుడు, పరాశక్తి ఇలా ఇప్పటికే అరడజను సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఇప్పుడు నారీనారీ నడుమ మురారి ఏడవది అవుతుంది. చాలా సెంటర్లలో మూడు నాలుగు థియేటర్లే ఉన్నాయి. అలాంటప్పుడు వీటిలో ఒకటి రెండు డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. ఎంత కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా సరే నారి నారి నడుమ మురారిని ఇంత టఫ్ ఫైట్ ని దింపడం సేఫ్ కాదనేది ఒక అభిప్రాయం. సరే బలమున్నోడు, విషయమున్నోడు గెలుస్తాడు కానీ ముందైతే ఇంత పెద్ద క్లాష్ ఎంతవరకు క్షేమమో అందరూ ఆలోచించుకోవాలి.

This post was last modified on December 3, 2025 10:15 am

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

54 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago