Movie News

కాంతార కవ్వింపు క్షమాపణ దాకా తెచ్చింది

ఇటీవలే గోవాలో జరిగిన వేడుకలో రణ్వీర్ సింగ్ హీరో రిషబ్ శెట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ కాంతార ఎక్స్ ప్రెషన్ ని రిక్రియేషన్ చేయడంతో పాటు గ్రామ దేవత పాత్రను దెయ్యం అన్నట్టుగా చెప్పడం కర్ణాటకలో తీవ్ర వివాదం రేపింది. ఏ మాత్రం అవగాహన లేకుండా అతను చేసిన చర్యని అందరూ తీవ్రంగా దుయ్యబట్టారు. కన్నడనాట ఏకంగా రణ్వీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ ని ఆడనివ్వమంటూ కొందరు నిరసన వ్యక్తం చేయడంతో రణ్వీర్ సింగ్ ఎట్టకేలకు దిగొచ్చి సారీ చెప్పాడు. ఇన్స్ టా స్టేటస్ లో రిషబ్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటూనే చివరికి మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమించండని అన్నాడు.

మాములుగానే ఎక్స్ ట్రీమ్ బిహేవియర్ (మితిమీరిన ప్రవర్తన)తో కనిపించే రణ్వీర్ సింగ్ తరచుగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. కాకపోతే ఈసారి మోతాదు మించిపోయింది. కాంతార సినిమా చూసి కూడా రిషబ్ వేసిన పాత్ర దేవుడో దెయ్యమో తెలియకుండా అంతగా ఎగతాళి చేయడం ఖండించాల్సిన విషయమే. ఒకప్పుడు పద్మావత్, బాజీరావు మస్తానీ లాంటి ఐకానిక్ మూవీస్ చేసిన రణ్వీర్ నుంచి ఇలాంటి చర్య ఎవరూ ఊహించలేదు. ట్విట్టర్ లో వైరల్ అయిన వీడియోలో రిషబ్ శెట్టి ఇదంతా నవ్వుతూ ఎంజాయ్ చేసినట్టు చూపించారు కానీ నిజానికి అతను వద్దని సంజ్ఞ చేసిన మరో క్లిప్ తాజాగా బయటికి వచ్చింది.

ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. రణ్వీర్ దురంధర్ ఈ శుక్రవారం విడుదల కానుంది. మూడున్నర గంటల నిడివితో యానిమల్ ని మించిన లెన్త్ పెట్టుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ టాక్. ధనుష్ తేరే ఇష్క్ మే కన్నా తక్కువ నెంబర్లు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణాదిలో అఖండ 2 తాండవం పోటీ వల్ల ప్రభావం పడేలా ఉంది. రణ్వీర్ సింగ్ మాత్రం దురంధర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.

This post was last modified on December 2, 2025 2:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పార్లమెంటులో కరిచే కుక్కలు ఉన్నాయి – కాంగ్రెస్ ఎంపీ

కరిచే కుక్కలు లోపల ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్న ఆమె…

29 minutes ago

అఖండ 3 ఉందని హింట్ ఇస్తున్నారా ?

రేపు రాత్రి అఖండ 2 తాండవం ప్రీమియర్లతో బాలయ్య షో ప్రారంభం కానుంది. ఓజి తర్వాత మళ్ళీ అంత పెద్ద…

2 hours ago

బైకర్ సౌండ్ లేదు… మురారి ఆగడం లేదు

శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…

3 hours ago

హీరోయిన్ సీన్లు క‌ట్ చేయించిన హీరో

హ‌నుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ స‌జ్జా. ఐతే ఈ…

3 hours ago

శ్రీవారి వైకుంఠ ద‌ర్శ‌నం… సెక‌నుకు 8 మంది!

ఔను! నిజం. మీరు చ‌దివింది అక్ష‌రాలా క‌రెక్టే!. సెక‌ను అంటే రెప్ప‌పాటు కాలం. ఈ రెప్ప‌పాటు కాలంలోనే అఖిలాండ కోటి…

4 hours ago

సచివాలయంలో బ్యారికెట్లపై సీఎం బాబు ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబు తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలతో మమేకం అవుతుంటారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం పరదాలు…

4 hours ago