Movie News

సమంత భర్త… సొంతూరు ఏదో తెలుసా?

వ్యక్తిగత జీవితంలో కొన్నేళ్ల పాటు ఒడుదొడుకులు ఎదుర్కొంది సమంత. నాగచైతన్య నుంచి నాలుగేళ్ల ముందు విడిపోయిన ఆమె.. మళ్లీ వ్యక్తిగత జీవితంలో స్థిరపడితే చూడాలని ఆశిస్తున్న తన అభిమానుల కోరిక తీరింది. ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి తమిళనాడులోని ఈషా ఫౌండేషన్లో సోమవారం జరిగింది. 

సమంత బహు భాషల్లో కథానాయికగా నటించినప్పటికీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉన్నది తెలుగులోనే. తెలుగు వారికి అంతగా చేరువైన సామ్.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది కూడా తెలుగు వ్యక్తినే అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కానీ.. రాజ్‌ది డిఫరెంట్  స్టోరీ. అతను రచ్చ గెలిచాడు కానీ.. ఇంకా ఇంటి వైపు చూడలేదు. అతను అచ్చమైన తెలుగువాడే. కానీ ఇక్కడ సినిమాలు డైరెక్ట్ చేయలేదు.

రాజ్‌ అసలు పేరు రాజేష్. అతను పుట్టింది పెరిగింది తిరుపతిలో. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఇంటర్మీడియట్ పుట్టపర్తిలో చదివిన రాజ్.. మళ్లీ ఇంజినీరింగ్ కోసం తిరుపతి వచ్చేశాడు. ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. అక్కడే చిత్తూరుకు చెందిన కృష్ణ దాసరకొత్తపల్లి (డీకే) పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి యుఎస్ వెళ్లి అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేశారు. ఆ సమయంలోనే వారికి సినిమాల పట్ల ఆసక్తి కలిగింది. 

ఉద్యోగం చేస్తూనే ఫిలిం కోర్సులు చేశారు. తర్వాత షార్ట్ ఫిలిం తీశారు. ఆపై ‘ఫ్లేవర్స్’ అనే ఇంగ్లిష్ మూవీతో దర్శకులుగా మారారు. 2009లో వీరి తొలి హిందీ చిత్రం ‘99’ రిలీజైంది. అప్పట్నుంచి బాలీవుడ్లోనే స్థిరపడిపోయారు. వీళ్లు తీసిన సినిమాల కంటే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ రెండో సీజన్లో సమంత విలన్ పాత్ర చేసింది. అప్పుడు రాజ్‌తో మొదలైన పరిచయమే.. తర్వాత ప్రేమగా మారి ఇద్దరినీ పెళ్లివైపు నడిపించింది.

This post was last modified on December 2, 2025 2:11 pm

Share
Show comments
Published by
Kumar
Tags: RajSamantha

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago