సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే నిర్మాత నాగవంశీ నుంచి కొత్త స్టేట్ మెంట్లు వచ్చాయి. ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య జంటగా నిర్మించిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ టైటిల్ విడుదల సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి బరిలో చిరంజీవి, రవితేజ, ప్రభాస్ లాంటి వాళ్ళతో పోటీ పడుతున్నారన్న ప్రశ్నకు బదులు చెబుతూ, వాటితో పోలిస్తే తనదే చిన్న సినిమా అని, కాబట్టి ప్రేక్షకులు జాలి తలచి తమది చూడాలని అన్నారు. కాసేపటికే అయినా ఇలాంటి సింపతీ స్టేట్మెంట్లు పని చేయడం లేదని కూడా సెలవిచ్చేశారు. రిక్వెస్ట్ చేయడం వరకు బాగానే ఉంది కానీ ఇక్కడో లాజిక్ చూడాలి.
నిజంగానే అంత సీనియర్లతో తలపడే కెపాసిటీ నవీన్ పోలిశెట్టికి లేదు. తన టైమింగ్, కంటెంట్ బలం రెండూ బ్యాలన్స్ అయితే సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి నిలబెడతాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దానికి మంచి ఉదాహరణ. జాతిరత్నాలు కూడా ఇదే కోవలోకి వస్తుంది. అవి పెద్దగా పోటీ లేని టైంలో వచ్చినవి. కానీ అనగనగా ఒక రాజు పరిస్థితి అలా లేదు. అసలు కోరుకున్నన్ని థియేటర్లు దక్కుతాయా లేదానేది పెద్ద ప్రశ్నగా మారింది. దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్లు మద్దతు ఇచ్చినా గ్రౌండ్ లెవెల్ లో ఆడియన్స్ ప్రాధాన్యతలు రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటాయి. గమించాల్సిన పాయింట్ మరొకటి ఉంది.
అనగనగా ఒక రోజు పండగ లాస్ట్ లో జనవరి 14 వస్తోంది. ఆలోగా రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, జన నాయకుడు రిలీజైపోయి ఉంటాయి. వాటికి హిట్ టాక్ వస్తే స్క్రీన్లు ఎక్కువ లాక్ అవుతాయి. పైగా నవీన్ పోలిశెట్టితో పాటు అదే రోజు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి రంగంలోకి దిగుతోంది. బోనస్ గా శివ కార్తికేయన్ పరాశక్తి కూడా ఉంటుంది. వీటి ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ఇంత టైట్ సర్కిల్ లో కామెడీని నమ్ముకుని వస్తున్న అనగనగా ఒక రోజు లాంటివి సోలోగా వస్తే ఇంకొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ దక్కించుకుంటాయి. బహుశాబయటికి చెప్పని ఓటిటి మెలిక ఏదైనా ఉందేమో.
This post was last modified on December 1, 2025 9:28 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…