హీరోల మీద అభిమానం ఉండటంలో తప్పేమీ లేదు. కానీ అది పరిమితులను పాటిస్తూ ఎవరికీ మానసిక క్షోభ కలిగించనంత వరకు ఎంతైనా చూపించుకోవచ్చు. కానీ హద్దులు దాటితే దాని వల్ల కలిగే పరిణామాలకు ఎందరో బాధ పడాల్సి వస్తుంది. ఇటీవలే విడుదలైన ఒక రీ రిలీజ్ పాత సినిమా సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక ఫ్యాన్ తల మీద మందు బాటిల్ పగలగొట్టుకుని దాన్నుంచి కారిన రక్తంతో సదరు స్టార్ బ్యానర్ కు తిలకం దిద్దాడు. దీనికి కిందున్న వాళ్ళు జేజేలు పలికారు. ఇలాంటి పిచ్చి చర్యలు లేలేత మనసుల మీద ప్రభావం చూపించి చిన్న పిల్లలు కూడా వీటి పట్ల ఆకర్షితులైతే దానికి బాధ్యత వహించేది ఎవరు.
ఇప్పుడే కాదు గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని చోటు చేసుకున్నాయి. బ్యానర్లు కడుతూ కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్లొస్తూ యాక్సిడెంట్ల బారిన పడి కాలం చేసిన వాళ్ళు ఎందరో. నష్టపరిహారంగా కొంత డబ్బు అంది ఉండొచ్చు. కానీ పోయిన ప్రాణాలు తేలేదుగా. ఆ తల్లితండ్రులు జీవితాంతం అనుభవించే నరకాన్ని ఎవరు తీరుస్తారు. పైన చెప్పినట్టు ఒకవేళ ఆ బాటిల్ వల్ల ఏదైనా గాయం కలిగి ఆ యువకుడికి జరగరానిది జరిగితే షూటింగులు ఆపేసి నివాళి చెప్పరుగా. అలాంటప్పుడు ముందు వెనుకా ఆలోచించాల్సింది ఎవరు. ఖచ్చితంగా అభిమానులే.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరైనా ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని హెచ్చరిస్తూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరు అభిమానుల భద్రత గురించి తాపత్రయపడే వాళ్లే. ప్రాణం కాదు తమ ఫ్యాన్స్ కి గాయం కూడా కాకూడదని కోరుకునే మనసు వీళ్లది. అలాంటిది ఇంత నిర్లక్ష్యంగా ప్రాణాలు పణంగా పెట్టి ఫ్యానిజం చూపించుకోవాల్సిన అవసరం ఏముంది. అయినా ఇలా చెప్పినంత మాత్రాన అందరూ మారిపోతారని కాదు. కనీసం ఒక్కరైనా అవును కదాని ఆలోచిస్తే ఎన్నో ప్రమాదాలు జరగవు. ఎన్నో ప్రాణాలు మిగులుతాయి.
This post was last modified on December 1, 2025 10:22 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…