ఇతర భాషల్లో స్టార్ హీరోలు టాలీవుడ్ సినిమాల్లో విలన్లుగా నటించడం కొత్త కాదు. కన్నడలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే టైగర్ ప్రభాకర్, దేవరాజ్ లాంటి వాళ్ళు చిరంజీవి, బాలకృష్ణ తదితరుల చిత్రాల్లో ప్రతినాయకులుగా కనిపించేవారు. ఈగలో సుదీప్ చేయడానికి కారణం రాజమౌళినే అయినా ఫైనల్ గా హీరో చేతిలో చనిపోయే క్యారెక్టర్ లోనే చూశాం. మమ్ముట్టి టాలీవుడ్ ఫస్ట్ మూవీ స్వాతికిరణంలో చేసింది నెగటివ్ షేడ్ ఉన్న పాత్రే. తర్వాత ఈ ట్రెండ్ కి కొంత బ్రేక్ వచ్చింది. బాలీవుడ్ నుంచి ముఖేష్ ఋషి, అశుతోష్ రానా, షియాజీ షిండే లాంటి ఫ్రెష్ విలన్లు దిగుమతి కావడంతో మల్లువుడ్, శాండల్ వుడ్ తారలు బ్రేక్ తీసుకున్నారు.
ఇప్పుడు మళ్ళీ ఆనాటి ట్రెండ్ రిపీట్ అయ్యేలా ఉంది. మహేష్ బాబు వారణాసిలో పృథ్విరాజ్ సుకుమారన్ ఫుల్ లెన్త్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కుంభగా ఆయన వయొలెంట్ విశ్వరూపం చూడొచ్చని ఇన్ సైడ్ టాక్ ఉంది. తన కోసం ఏకంగా ఒక పాటే జక్కన్న పెట్టాడంటే ఏ రేంజ్ డిజైన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సలార్ లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్సిన పృథ్విరాజ్ అందులో చేసింది కంప్లీట్ విలన్ కాదు. ప్రభాస్ స్నేహితుడిగానే హైలైట్ అయ్యాడు. ఇప్పుడు వారణాసిలో అలా కాదు. తెలుగు తెరమీద ఇప్పటిదాకా చూడని ఫెరోషియస్ విలన్ గా రాజమౌళి చూపించబోతున్నాడని అంతర్గతంగా వినిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీలో టోవినో థామస్ నటిస్తున్నాడు. నెగటివ్ రోల్ అని టీమ్ అధికారికంగా చెప్పలేదు కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తనని మోస్ట్ బిగ్గెస్ట్ బ్యాడీగా చూపించబోతున్నారట. ఇటీవలే టోవినోని అడిగి సినిమా గురించి చెప్పమంటే దాటేశాడు తప్ప బయట పడలేదు. అంత గుట్టుగా డీటెయిల్స్ బయటికి రానివ్వకుండా ఆర్టిస్టులు జాగ్రత్త పడుతున్నారు. ఈ విలన్లుగా ఓకే కానీ మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ లాగా మన సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తే ఇంకా బాగుంటుంది. ప్యాన్ ఇండియా పదం పుట్టుకొచ్చాక నటీనటులకు భాషా హద్దులు చెరిగిపోయాయి.
This post was last modified on November 29, 2025 9:46 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…