Movie News

తూటా లేకుండా ‘రివాల్వర్’ పేల్చి ఏం లాభం

ఇవాళ కీర్తి సురేష్ కొత్త సినిమా రివాల్వర్ రీటా విడుదలయ్యిందనే సంగతి సామాన్య ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియదు. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ రాధికా శరత్ కుమార్, సునీల్, జాన్ విజయ్ లాంటి మనకు పరిచయం ఉన్న ఆర్టిస్టులు కనిపించారు కాబట్టి ఎంతో కొంత ఓపెనింగ్స్ వస్తాయని నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. కీర్తి సురేష్ హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు చేసింది. సందర్భం లేకుండా చిరంజీవి గురించి ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్న పుణ్యమాని కాస్త టాపిక్ లో నిలిచింది. ఇవేవి పని చేయలేదు. హైదరాబాద్ లో కొన్ని షోలు రన్ కాగా చాలా సెంటర్లలో కనీస ఆక్యుపెన్సీలు లేవని ట్రేడ్ రిపోర్ట్.

అసలు రీటా రివాల్వర్ లో ఏముందంటే ఇదో డార్క్ కామెడీ థ్రిల్లర్. కొత్తగా ఏముండదు. గతంలో కోకో కోకిల, కీడా కోలా లాంటి ఎన్నో సినిమాలు వద్దన్నా గుర్తకు వస్తాయి. కథగా చెప్పాలంటే సింపుల్ లైన్. ఓ తల్లి కూతూరు అనుకోకుండా ఇంటికి వచ్చి బెదిరించిన డాన్ ని పొరపాటున చంపేస్తారు. శవాన్ని మాయం చేసే ఉద్దేశంతో పడే తంటాలు, ఆ గ్యాంగ్ స్టర్ కొడుకు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు, పోలీసుల వ్యూహాలు ఇలా చాలా మసాలాలే దట్టించారు. అయితే బిర్యానీకి కావలసిన అసలైన ముడిపదార్థం బియ్యం, మాంసం లేకుండా వంట చేయడంతో ప్లేటు వదిలేసే పారిపోయేలా చేశాడు దర్శకుడు జెకె చంద్రు.

కొత్తదనం ఏ మాత్రం కనిపించకుండా విసుగొచ్చేలా స్క్రీన్ ప్లే ఎలా రాయాలో రివాల్వర్ రీటా మంచి ఉదాహరణగా నిలుస్తుంది. మహానటిలో ఎంతో గొప్పగా నటించిన కీర్తి సురేష్ ని ఇలాంటి పేలవమైన పాత్రలో చూడటం విషాదం. తను టైటిల్ రోల్స్ చేసిన సినిమాలు దాదాపు అన్నీ డిజాస్టర్లే. మిస్ ఇండియా, పెంగ్విన్, గుడ్ లక్ సఖి వగైరాలు కనీసం వచ్చినట్టు కూడా జనాలకు తెలియనంతగా ఫ్లాపయ్యాయి. ఒక దశలో మహేష్ బాబు, విక్రమ్, విశాల్ లాంటి హీరోలకు జోడిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ తో అదృష్టం పరీక్షించుకుంది కానీ అక్కడా ఫెయిల్యూర్ తప్పలేదు.

This post was last modified on November 28, 2025 7:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

39 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

42 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

1 hour ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago