మలయాళ సినీ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడు మమ్ముట్టి. ఆ ఇండస్ట్రీకి మోహన్ లాల్ ఒక కన్ను అయితే.. మరో కన్ను మమ్ముట్టి. నటుడిగా ఆయన గొప్పదనమేంటో స్వాతికిరణం, దళపతి సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఇక ఆయన అందుకున్న బాక్సాఫీస్ విజయాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 70 ఏళ్లు పైబడ్డా ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు మమ్ముట్టి.
ఐతే నాలుగు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంటున్న మమ్ముట్టి.. ఇప్పటిదాకా తన పేరు వెనుక ఉన్న కథేంటన్నది మాత్రం ఎవరికీ చెప్పలేదు. తన అసలు పేరు మమ్ముట్టి అది కాదని చెబుతూ ఆ పేరు తనకు ఎలా వచ్చిందో ఆయన తాజాగా ఒక వేడుకలో ఆయన వెల్లడించారు. తన ఫ్రెండు అనుకోకుండా తనకు ‘మమ్ముట్టి’ అనే పేరు పెట్టడం వెనుక స్టోరీని ఆయన బయటపెట్టారు.
మమ్ముట్టి అసలు పేరు.. మహమ్మద్ కుట్టి అట. కానీ తాను కాలేజీలో చదివే రోజుల్లో ఆ పేరును దాచిపెట్టి ఒమర్ షరీఫ్ అనే పేరుతో చలామణి అయినట్లు మమ్ముట్టి తెలిపాడు. ఐతే ఒక రోజు తాను కాలేజీలో ఐడీ కార్డ్ మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయానని.. ఆ కార్డు తన ఫ్రెండుకు దొరికిందని మమ్ముట్టి తెలిపాడు. ఆ ఫ్రెండు తన పేరును పొరపాటున ‘మమ్ముట్టి’ అని అందరికీ చెప్పాడని.. ఆ పేరే కాలేజీలో పాపులర్ అయిందని.. సినీ రంగంలో కూడా అదే పేరుతో కంటిన్యూ అయ్యానని మమ్ముట్టి తెలిపాడు.
ఈ కథ అంతా చెబుతూ.. తనకు ‘మమ్ముట్టి’ అనే పేరు పెట్టిన స్నేహితుడిని వేదిక మీదికి పిలిచి అందరికీ పరిచయం చేశాడు మమ్ముట్టి. ఆ ఫ్రెండు పేరు.. శశిధరన్ అని చెప్పాడు. తన పేరు గురించి మీడియాలో ఇప్పటిదాకా అనేక కథనాలు వచ్చాయని.. అవేమీ నిజం కాదని.. అసలు కథ ఇదని మమ్ముట్టి తెలిపాడు. ఇప్పటిదాకా 420 సినిమాల్లో నటించిన మమ్ముట్టి ప్రస్తుతం ‘కళంకావల్’ అనే చిత్రం చేస్తున్నాడు.
This post was last modified on November 28, 2025 3:52 pm
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…