Movie News

గోపాలుడి కాన్సెప్టుతో గుజరాతీ బ్లాక్ బస్టర్

వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల గుర్తుందిగా. అందులో నాస్తికుడిగా ఉన్న వ్యక్తి కోసం సాక్ష్యాత్తు శ్రీ కృష్ణుడు భూమిపైకి వచ్చి తన మహత్తు తెలిసేలా చేస్తాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓ మై గాడ్ గా రీమేక్ గా రూపొందిన ఈ మల్టీస్టారర్ మంచి విజయమే సాధించింది. దీని తర్వాత నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2లోనూ కృష్ణుడిని హైలైట్ చేసిన దర్శకుడు చందూ మొండేటి ఏకంగా నార్త్ ఆడియన్స్ తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టించాడు. ఈ మధ్య ఇదో సక్సెస్ ఫార్ములాగా మారిపోతోంది. మన దగ్గరే కాదు అసలు సినిమాల మార్కెట్ చాలా తక్కువగా ఉండే గుజరాత్ లోనూ ఇది కామధేనువుగా మారింది.

అక్టోబర్ 10న అక్కడ లాలో కృష్ణ సదా సహాయతే విడుదలయ్యింది. బడ్జెట్ యాభై లక్షలలోపే. మొదటి రోజు టాక్ బాగానే వచ్చింది. వసూళ్లు పెద్దగా లేవు. క్రమంగా అది వైరస్ గా మారి ఇప్పుడు ఏకంగా వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది. వందల కోట్లతో తీసిన ప్యాన్ ఇండియా మూవీసే పది రోజుల తర్వాత నెమ్మదిస్తున్న టైంలో ఈ గుజరాతి చిత్రం ఏకంగా రికార్డులు బద్దలు కొడుతూ ఇప్పటికీ హౌస్ ఫుల్స్ నమోదు చేయడం అనూహ్య పరిణామం. మొదటి రెండు మూడు వారాలు చాలా సెంటర్లలో టికెట్లు దొరక్క లక్షలాది ప్రేక్షకులు వెనక్కు వెళ్లిన దాఖలాలు గురించి మీడియాలో హైలైట్ చేస్తున్నారు.

అలాని ఇందులో కనివిని ఎరుగని కథేమీ లేదు. కష్టాల్లో ఉన్న ఒక ఆటో డ్రైవర్ కోసం మనిషి రూపంలో కృష్ణుడు వస్తాడు. దగ్గరుండి అతని నిరాశా నిస్పృహలను పోగొట్టి మంచి స్థాయికి చేరుకునేలా చేస్తాడు. ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్, డివోషన్ అన్నీ సమపాళ్లలో మిక్స్ చేసిన దర్శకుడు అంకిత్ సఖియా దెబ్బకు స్టార్ డైరెక్టర్ అయిపోయారు. గుజరాత్ లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ గ్రాసర్ రికార్డు 50 కోట్లతో చాల్ జీవి లాయియే మొదటి స్థానంలో ఉంది. దాన్ని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసిన లాలో కృష్ణ సదా సహాయతే ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. అన్నట్టు వివిధ బాషల నుంచి రీమేక్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది.

This post was last modified on November 28, 2025 12:21 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

45 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago