Movie News

వారం రోజుల సంబరానికి థియేటర్ రిలీజా

ఒకపక్క నాలుగు వారాల థియేటర్ విండో పట్ల డిస్ట్రిబ్యూటర్లలో వ్యతిరేకత ఉంది. రిలీజైన నెల రోజులకే ఓటిటిలో రావడం వల్ల రెవిన్యూ తగ్గుతోందని పలు సందర్భాల్లో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ, థియేటర్ లైఫ్ తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిని సేఫ్ చేసుకోవడం కోసం నిర్మాతలకు వేరే ఆప్షన్ ఉండటం లేదు. సరే ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఎవరేం చేయలేరనుకున్నా మరీ వారం గ్యాప్ అంటే ఖచ్చితంగా షాక్ ఇచ్చేదే. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ పాంచ్ మినార్ హఠాత్తుగా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. గత శుక్రవారమే ఇది థియేటర్లో అడుగుపెట్టింది. కొంచెం డీసెంట్ టాక్ వచ్చింది కానీ నిలబడలేదు.

రాజ్ తరుణ్ మార్కెట్ ఎప్పుడో రిస్క్ లో పడింది. వరస ఫ్లాపులు తనకు ప్రేక్షకులకు మధ్య దూరం పెంచాయి. ఓటిటిలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ పెద్దగా పనవ్వలేదు. సరే ఒక హిట్ దక్కితే మళ్ళీ రేస్ లోకి రావోచ్చనుకుంటే ఇదిగో ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయి. పాంచ్ మినార్ చిన్న పాయింట్ తో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందింది. రాజ్ తరుణ్ గత సినిమాలతో పోలిస్తే బెటరనే అభిప్రాయం వినిపించింది. కాకపోతే అది ఫుట్ ఫాల్స్ గా మారలేదు. అయినా ఈ మాత్రం వారం రోజుల సంబరానికి కష్టపడి థియేటర్ రిలీజ్ చేయడం వెనుక పరమార్ధం అంతు చిక్కడం లేదు.

ఇక్కడ రాజ్ తరుణ్ ప్రాక్టికల్ గా చూడాల్సిన కోణం మరొకటి ఉంది. తన తర్వాత వచ్చిన యూత్ హీరోలు మంచి ప్లానింగ్ తో దూసుకెళ్ళిపోతున్నారు. నవీన్ పోలిశెట్టి, కిరణ్ అబ్బవరంలాంటి వాళ్ళను మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తిరువీర్ సైతం అడపాదడపా హిట్లతో మార్కెట్ లో నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో బాగా వెనుకబడిపోయిన రాజ్ తరుణ్  కంబ్యాక్ కావడం అంటే ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే కానీ జరగలేదు. ఉయ్యాలా జంపాల, కుమార్ 21 ఎఫ్ లాంటి రెండు మూడు తప్ప ఇంత సుదీర్ఘమైన కెరీర్ లో పెద్దగా హిట్లు లేకపోవడం రాజ్ తరుణ్ పాలిట శాపమే.

This post was last modified on November 28, 2025 11:42 am

Share
Show comments
Published by
Kumar
Tags: Paanch Minar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

5 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

6 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

6 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

9 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago