సోషల్ మీడియాలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీద పెద్ద చర్చే జరుగుతోంది. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకి కథ చెప్పాడని, అది పవన్ కళ్యాణ్ కేననే ప్రచారం జోరుగా తిరిగింది. లోకేష్ డేట్లు, పవన్ కమిట్ మెంట్ రెండూ కెవిఎన్ ప్రొడక్షన్స్ దగ్గర ఉన్నాయి. అందుకే ఈ కాంబో సాధ్యమనే రేంజ్ లో సంకేతాలు వచ్చాయి. అయితే లోకేష్ కనగరాజ్ ప్రయత్నం చేస్తోంది పవన్ కోసం కాదని, అల్లు అర్జున్ తో ఇటీవలే ఒక సమావేశం కూడా జరిగిందని చెన్నై వర్గాల టాక్. అయితే వినడానికి బాగానే ఉంది ఈ కాంబో అనుకున్నంత ఈజీ కాదు. దీని వెనుక బోలెడు క్యాలికులేషన్లు ఉన్నాయి. అర్థం కావాలంటే డీటెయిల్స్ లోకి వెళ్ళాలి.
పుష్ప తర్వాత బన్నీ కథలు, దర్శకుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కొరటాల శివతో ప్రాజెక్టు ఓకే అయిపోయి అనౌన్స్ మెంట్ వచ్చాక వద్దనుకోవడానికి కారణం ఇదే. సంజయ్ లీలా భన్సాలీ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముంబై మీడియాలో వార్త చక్కర్లు కొట్టగా, దానికి బలం చేకూరుస్తూ భన్సాలీ ఇంటికి బన్నీ వెళ్ళొచ్చాడు. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. సో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కు గుడ్డిగా ఓకే చెబుతాడని అనుకోవడానికి లేదు. ఎందుకంటే కూలి చూశాక లోకేష్ క్రెడిబిలిటీ మీద అనుమానాలు వచ్చేశాయి. రజినీకాంత్ ఎలివేషన్లు తప్ప మ్యాటర్ లేని సినిమాగా నిలిచింది.
కూలి ఫలితంతో నిరాశ చెందిన లోకేష్ కనగరాజ్ తన డ్రీం కాంబో కమల్ హాసన్ – రజనీకాంత్ కలయికలో సినిమా కోసం ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ గ్రీన్ సిగ్నల్ రాలేదు. వచ్చే అవకాశమూ లేదు. ఈలోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా ఓకే కావడంతో అటు యాక్టింగ్ లో బిజీ అయిపోయాడు. ఇవన్నీ చూసుకుంటే బన్నీ అంత ఈజీగా ఓకే చెప్పడు. అట్లీతో కూడా నెలల తరబడి చర్చలు, నెరేషన్లు విన్నాకే పచ్చజెండా ఊపాడు. అన్నట్టు లోకేష్ కనగరాజ్ లిస్టులో రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఉన్నారట. చివరికి ఎవరితో ఎప్పుడు ఎలా సెట్ చేసుకుని సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates