కె.జి.ఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్‍తో ప్రభాస్ చేసే ‘సలార్’ చిత్రం అతనే తీసిన కన్నడ సినిమా ‘ఉగ్రమ్’కి రీమేక్ అనేది తెలిసే వుంటుంది. ఆ సినిమా సగటు మాస్ సినిమాలానే వుంటుంది కదా, ఎందుకని ప్రభాస్ అంత ముచ్చటపడి చేస్తున్నాడనేది ఫాన్స్కి అంతు చిక్కడం లేదు. అయితే ప్రశాంత్ నీల్ ఆ కథను ఇప్పటి ప్రభాస్ ఇమేజ్‍కు అనుగుణంగా మార్చాడట. రెండు పెద్ద మాఫియా గ్రూపులతో తలపడి స్నేహితుడి కోసం పగ తీర్చుకునే వాడిగా ప్రభాస్ ఇందులో కనిపిస్తాడట.
‘సలార్’ అంటే ఉర్దూలో నాయకుడు అని అర్థం. ఈ చిత్రానికి ‘బాషా’ మాదిరి ట్రీట్‍మెంట్ ప్రశాంత్ నీల్ ఇచ్చాడని, అతను రాసిన ఎలివేషన్ సీన్స్ మాస్‍ని ఉర్రూతలూగించేలా వుంటాయని సమాచారం. ఇదిలావుంటే పాన్ ఇండియా సినిమాలంటే అన్నీ భారీ చిత్రాలు, గ్రాఫిక్స్ ప్రధాన సినిమాలే చేయాలా, లేక ఇలాంటి మాస్ సినిమాలను చేసినా పాన్ ఇండియా ఆడియన్స్ తనను యాక్సెప్ట్ చేస్తారా అనేది టెస్ట్ చేసుకోవడానికి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడట. ఒకవేళ సలార్‍కి అంతటా ఆదరణ బాగుంటే ఇక మన స్టార్ దర్శకులైన త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి వాళ్లతోనే మాస్ సినిమాలు చేసి పాన్ ఇండియా మార్కెట్‍లో విడుదల చేయాలనేది ఆలోచన అట. ఒక విధంగా ఇది ప్రభాస్ చేస్తోన్న ప్రయోగాత్మక మాస్ ప్రయత్నమన్నమాట.
This post was last modified on December 6, 2020 2:02 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…