బిగ్‍బాస్ సీజన్ 4 నుంచి కమెడియన్ అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అతడు ఎలిమినేట్ అయ్యాడనే వార్త కంటే ముందు మోనల్ ఎలిమినేట్ అయిందనే వదంతి ఫాస్ట్గా వ్యాపించింది. అయితే గత వారం కూడా మోనల్, అవినాష్ ఇద్దరూ నామినేషన్లలో వుండగా అవినాష్‍కే తక్కువ ఓట్లు పడి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చి అతను మరో వారం వుండేలా బిగ్‍బాస్ టీమ్ జాగ్రత్త పడ్డారు. అలాంటిది ఈసారి మోనల్, అవినాష్ ఇద్దరూ నామినేషన్లలో వున్నపుడు మోనల్‍కి తక్కువ ఓట్లు పడి అవినాష్‍కి ఎందుకు ఎక్కువ వస్తాయి? బిగ్‍బాస్ టీమ్ మోసం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది కానీ ఈ దశలో వారికి మోనల్ కంటే అవినాష్ వుంటేనే కంటెంట్ ఎక్కువ దొరుకుతుంది.
మరి అతడిని మోసం చేసి ఎందుకు బయటకు వెళ్లగొడతారు. నిజానికి నామినేషన్ పర్వం పూర్తయిన దగ్గర్నుంచీ మోనల్‍కి ఓట్లు బ్రహ్మాండంగా పడ్డాయి. నామినేషన్స్లో మోనల్ తన వాదన గట్టిగా వినిపించడం, అవినాష్ ఆమెను అన్యాయంగా టార్గెట్ చేయడం ప్రేక్షకులు గమనించారు. ఇక ఆ తర్వాత పలుమార్లు అవినాష్ తన సహనం కోల్పోయి మోనల్‍పై, అరియానాపై అరిచి కేకలు పెట్టాడు. అఖిల్, సోహైల్‍పై కూడా కోపం వచ్చినా కానీ వారిని ఫేస్ చేసే ధైర్యం లేక వెనక నసుక్కున్నాడు. ఇలా ప్రతి అంశంలోను తన గెలుపు అవకాశాలను అవినాష్ స్వయంగా చెడగొట్టుకున్నాడు. అసలుకి నోయెల్ వెళ్లిపోయిన రోజే అవినాష్ పతనం ప్రారంభమయింది. ఆ తర్వాత అతను మునుపటిలా ఎంటర్‍టైన్ చేయలేక అనుక్షణం తన ఇన్‍సెక్యూరిటీని బయట పెట్టుకుని ప్రేక్షకుల అండదండలు పోగొట్టుకున్నాడు. అమ్మ రాజశేఖర్ తర్వాత ఈ సీజన్లో బ్యాడ్ అయి వెళుతోంది అవినాషే అనేది ముమ్మాటికీ వాస్తవం.
This post was last modified on December 6, 2020 2:00 am
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…