రాజు వెడ్స్ రాంబాయి.. టాలీవుడ్లో ఈ సినిమా కొత్త సంచలనం. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను అందించిన ఈటీవీ విన్ వాళ్లే దర్శకుడు వేణు ఉడుగులతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ను రిలీజ్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని కూడా తమ బేనర్ల నుంచి విడుదల చేశారు. కొత్త హీరో హీరోయిన్లు, కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమా అయినా.. ఇది ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పటికే వసూళ్లు రూ.10 కోట్లను చేరుతున్నాయి. ఈ సినిమా స్థాయికి అది పెద్ద నంబరే. ‘రాజు వెడ్స్ రాంబాయి’లో భాగమైన అందరికీ మంచి మంచి అవకాశాలే వస్తాయనడంలో సందేహం లేదు. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ బాబీ.. తన వంతుగా ఇద్దరికి ఛాన్స్‌లు కూడా ఇచ్చేశాడు. ఆ ఇద్దరే.. దర్శకుడు సాయిలు, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్.
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సాయిలు స్పీచ్ విని తాను కదిలిపోయినట్లు బాబీ చెప్పాడు. సాయిలు మాటలు విని తనకు వణుకు పుట్టిందని.. నిజాయితీగా ఉండేవాళ్లు ఇలానే ఉంటారని అనిపించిందని బాబీ చెప్పాడు. ఈ సినిమా చూశాక తనకు కూడా నిర్మాతగా మారాలనిపించిందని తెలిపాడు. ఇక స్టేజ్ మీదే సాయిలును పిలిచి.. చిరంజీవి హీరోగా తాను తీయబోయే సినిమాలో నువ్వొక పాత్ర చేయాలి అని బాబీ అడగ్గా.. అంతకంటే భాగ్యమా అన్నట్లు సరే అన్నాడు సాయిలు.
మరోవైపు మిట్టపల్లి సురేందర్ రాసిన ‘రాంబాయి నీ మీద నాకు..’ పాటను కొనియాడిన బాబీ.. చిరు చిత్రంలో అతడికి ఒక పాట రాసే అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. దీంతో అతనూ అమితానందానికి గురయ్యాడు. మొత్తానికి ఓ చిన్న సినిమాతో తమ ప్రతిభను చాటిన సాయిలు, మిట్టపల్లి సురేందర్.. ఏకంగా చిరు సినిమాలోనే అవకాశాలు అందుకోబోతున్నారన్నమాట.
This post was last modified on November 26, 2025 5:47 pm
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…