ఊహించని విధంగా తక్కువ అంచనాలతో రిలీజై సూపర్ హిట్ అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి చూసేందుకు లిమిటెడ్ బడ్జెట్ లా కనిపిస్తున్నా దాని వెనుక పడిన కష్టం, తపన, శ్రమ చాలా పెద్దవి. విరాట పర్వం ఫ్లాప్ అయ్యాక దర్శకుడు వేణు ఊడుగులకు మళ్ళీ డైరెక్షన్ చేసేందుకు టైం పట్టింది. ఈలోగా సమయం వృథా కాకుండా కొత్త టాలెంట్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు కలిసిన వ్యక్తే సాయిలు కంపాటి. సురేష్ బొబ్బిలి పరిచయంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చిన సాయిలు తొలి ఫోన్ కాల్ నుంచే తన అమాయకత్వాన్ని చూపించడం వేణుని కట్టి పడేసింది.
చేతిలో ఎంతో కంటెంట్ ఉన్నా ఆత్మనూన్యతా భావం, భయంతో తొలినాళ్ళలో తాను అనుభవించిన గతాన్ని వేణు ఊడుగుల గుర్తు చేసుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయి వెనుక ఈటీవీ విన్, బన్నీ వాస్, వంశీ నందిపాటి లాంటి పెద్ద చేతులు ఉండొచ్చు. కానీ అవి కలవడానికి పునాది వేసింది వేణు ఊడుగుల. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టించకుండా పూర్తిగా కథలో నిజాయితీని నమ్మడం వల్ల ఈ రోజు గొప్ప ఫలితం అందుకున్నారు. పెట్టుబడి మీద లాభం రాబట్టుకోవడం అంటే ఏంటో చూపించారు. డైరెక్టర్ గా కన్నా ఒక ప్రొడ్యూసర్ గా వేణు ఊడుగుల చూపిస్తున్న ఆనందం ఎందరో స్ఫూర్తిగా తీసుకోవాలి.
ప్యాన్ ఇండియా ఫీవర్ పట్టుకున్నాక హీరోలు, దర్శకులు ప్రతి సినిమాకు రెండేళ్లు తీసుకోవడం సాధారణమైపోయింది. దీని వల్ల నిర్మాతలకు బడ్జెట్ భారం కావడంతో పాటు బొమ్మ ఏ మాత్రం అటుఇటు అయినా నిండా మునిగిపోతున్నారు. అలా కాకుండా మట్టి వాసన నుంచి వచ్చే రాజు వెడ్స్ రాంబాయి లాంటి కథలను, సాయిలు లాంటి ప్రతిభలను వెలికి తీస్తే అద్భుతాలు చేయొచ్చు. గొప్ప సినిమా, క్లాసిక్ అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్ కు ఓ నాలుగు రూపాయలు మిగిలేలా చేసినవాడే విజేత. వేణు ఊడుగుల, సాయిలు కంపాటి అలియాస్ బోస్ ఇప్పుడీ విజయానందాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు.
This post was last modified on November 26, 2025 10:49 am
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…