Movie News

‘కొదమసింహం’ సీక్రెట్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి ఫిల్మోగ్రఫీలో ‘కొదమ సింహం’ చాలా ప్రత్యేకం. తెలుగులో అరుదు అనదగ్గ కౌబాయ్ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. అంతకుముందు కృష్ణ మాత్రమే ఆ పాత్రలో అలరించారు. చిరు అంతకుమించిన స్వాగ్, స్టైల్‌తో కౌబాయ్ పాత్రను అద్భుతంగా పోషించాడు. కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ సాధించకపోయినా.. మెగా అభిమానులకు ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోయింది. 

చిరు కూడా ఈ సినిమాను, పాత్రను చాలా స్పెషల్‌గా భావిస్తారు. ఇటీవలే ఈ సినిమా 4కేలో రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిరు ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఈ సినిమా జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ‘కొదమసింహం’లో ఒక మూమెంట్ గురించి ఎన్నో ఏళ్లుగా జనాలకు ఉన్న సందేహాలకు తెరదించారు.

‘స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్’ అంటూ సాగే ఈ సినిమా ఇంట్రో సాంగ్‌లో చిరు ఒక చోట ఒక గదిలో రౌండ్ ద క్లాక్ నడుచుకుంటూ వెళ్తాడు. గోడ మీదికి ఎక్కుతున్నపుడు.. రివర్స్‌లో నడుస్తున్నపుడు కిందపడడం ఏమీ ఉండదు. నేరుగా నేల మీద నడిచినట్లే నడుస్తాడు. ఆ రోజుల్లో అది అందరినీ అబ్బురపరిచింది. అప్పుడున్న టెక్నాలజీతో దీన్ని ఎలా చిత్రీకరించారో అనే సందేహం చాలామందిలో ఉంది. దాని గురించి చిరు ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. 

ఒక బాక్స్ తరహాలో రూం సెట్ వేసి.. దాన్ని బయటి నుంచి తిప్పుతూ ఉంటే.. లోపల తాను నడుస్తుండగా కెమెరాతో షూట్ చేశారని.. బయటి ఎఫెక్ట్ ఎవరికీ కనబడదని.. తాను గోడల మీద ఏ సపోర్ట్ లేకుండా నడుస్తున్నట్లు అనిపిస్తుందని చిరు చెప్పాడు. కొన్నేళ్ల ముందు హాలీవుడ్ మూవీ ‘ఇన్సెప్షన్’లో ఇలాంటి సన్నివేశం ఒకటి చూశానని.. ఈ కాన్సెప్ట్‌ను అప్పట్లోనే తాము ‘కొదమసింహం’లో చూపించామని.. ఇది అందరినీ ఆశ్చర్యపరిచిందని చిరు చెప్పుకొచ్చాడు. ఐతే చిరు ‘కొదమసింహం’ రీ రిలీజ్ విషయంలో చాలా ఎగ్జైట్ అయ్యాడు కానీ.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన అయితే కనిపించలేదు.

This post was last modified on November 23, 2025 5:35 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

3 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

23 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

55 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago