ఇది సోషల్ మీడియా కాలం. సెలబ్రెటీ స్టేటస్ ఉన్న ఎవ్వరైనా తమ మాటలు, చేతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యథాలాపంగా చేసే కామెంట్లు కూడా కొన్నిసార్లు తీవ్ర వివాదాస్పదమై మొత్తం ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుంటాయి. ఇప్పుడు న్యూస్ ప్రెజెంటర్ కమ్ యాంకర్ శివజ్యోతి ఇలాగే నోరు జారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తాను ఎక్కడున్నా.. దేని గురించి మాట్లాడుతున్నా అని చూసుకోకుండా ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది.
ఇటీవలే శివజ్యోతి తన భర్త, సన్నిహితులతో కలిసి తిరుమలకు వెళ్లింది. అక్కడ క్యూ లైన్లో నిలబడి ఉండగా.. టీటీడీ సిబ్బంది పక్క నుంచి భక్తులకు ప్రసాదం అందజేశారు. ఇది అక్కడ కామన్ ప్రాక్టీసే. ఐతే ఈ ప్రసాదం తీసుకుంటున్న సందర్భంగా వీడియో తీసుకుంటూ శివజ్యోతి, ఆమె భర్త చేసిన కామెంట్లు తీవ్ర వివాదానికి దారి తీశాయి. తాము కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నామని.. తాము రిచెస్ట్ బిచ్చగాళ్లమని శివజ్యోతి, ఆమె భర్త సెల్ఫీ వీడియోలో కామెంట్ చేశారు. ఏదో ఒకసారి అంటే ఏదోలే అనుకోవచ్చు కానీ.. పదే పదే ఆ మాటలను వల్లెవేయడం.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వ్యతిరేకత తప్పలేదు.
తిరుమలలో దర్శనానికి వెళ్తూ క్యూ లైన్లో ఇలాంటి వీడియోలు చేయడమే తప్పంటే.. శ్రీవారి ప్రసాదం గురించి ఇలా కామెంట్ చేయడం భక్తుల మనోభావాలను దెబ్బ తీసేదే అని.. హిందూ దేవుళ్లు, ఆలయాలు.. హిందూ సంస్కృతి, ఆచారాల గురించి కామెంట్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందని.. శివజ్యోతి బహిరంగ క్షమాపణ చెప్పాలని.. అలాగే ఆమె మీద టీటీడీ చర్యలు చేపట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో శివజ్యోతి ఇమేజ్ డ్యామేజ్ అయింది. సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ వీడియోతో ఆమె మరింత ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది.
This post was last modified on November 23, 2025 9:04 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…