Movie News

‘బిగ్ బాస్’లోకి తిరిగొస్తాడనుకుంటే.. షో చూడ్డమే లేదట

ఈసారి తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్లో కంటెస్టెంట్ల జాబితా బయటికి వచ్చినపుడు టైటిల్ రేసులో ఉండదగ్గ వాళ్లలో నోయల్ ఒకడిగా భావించారు. హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే జనాలకు అతను బాగా తెలుసు. ఆరంభ ఎపిసోడ్లలో అతడి నడవడిక కూడా ఆకట్టుకుంది. కానీ అనూహ్యంగా అనారోగ్య కారణాలతో అతను హౌస్ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత అతను కోలుకున్నాక ‘బిగ్ బాస్’ అభిమానులతో చిట్‌చాట్‌లు చేశాడు. ఇంకా షో అయిపోలేదు అనడం ద్వారా తాను హౌస్‌లోకి తిరిగి రాబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చాడు. దీంతో నోయల్ ఫ్యాన్స్ అతడి రీఎంట్రీ కోసం ఎదురు చూశారు. కానీ నోయల్ మళ్లీ రావడం లాంటిదేమీ జరగలేదు. ఐతే షో పట్ల ఇంతకుముందు అతను ఎలాంటి వ్యతిరేకత చూపించింది లేదు కాబట్టి.. తన నిష్క్రమణ తర్వాత షోను ఫాలో అవుతుంటాడనే అనుకున్నారంతా.

కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోయల్ మాట్లాడుతూ తాను ‘బిగ్ బాస్’ చూడ్డమే మానేశానని చెప్పడం విశేషం. తాను అసలు ‘బిగ్ బాస్’కు ఎందుకు వెళ్లానో అర్థం కావడం లేదని, ఆ షో వల్ల తనకెలాంటి ఉపయోగం లేకపోయిందని, ఈ షో మనకు అవసరం లేదనే భావన కలిగిందని నోయల్ అన్నాడు. తాను హౌస్ నుంచి బయటికి వచ్చేశాక షో పట్ల ఆసక్తి తగ్గిపోయిందని, దీంతో రోజువారీ ఎపిసోడ్లు చూడటం మానేశానని నోయల్ చెప్పాడు.

ఇక హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు బెస్ట్, టైటిల్ ఎవరు గెలుస్తారు అని అడిగితే అతను సూటిగా సమాధానం ఇవ్వలేదు. హౌస్‌లో ఉన్న వాళ్లందరూ మంచోళ్లే అని.. ఐతే తన మద్దతు మాత్రం అభిజిత్, హారికలకే అని చెప్పాడు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన నోయల్.. సినిమాల్లో క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చాలానే చేశాడు. వాటిలో కుమారి 21 ఎఫ్, నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్ లాంటి సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చాయి.

This post was last modified on December 4, 2020 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

8 minutes ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

12 minutes ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

60 minutes ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

2 hours ago

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

2 hours ago

బాలయ్య హిందీ, తమిళంలోనూ ఇరగదీస్తున్నాడుగా

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ‌-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…

3 hours ago