Movie News

ఫ్యామిలీ మ్యాన్-3ని అలా ముగించారేంటి?

ఇండియాస్ మోస్ట్ లవ్డ్ సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి.. మళ్లీ బుల్లెతెరల్లోకి వచ్చేశాడు. మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రలో రాజ్-డీకేల ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ నుంచి మూడో సీజన్ శుక్రవారమే స్ట్రీమింగ్‌కు వచ్చింది. గత రెండు సీజన్ల టెంపోను మూడో సీజన్లోనూ టీం కొనసాగించింది. సీజన్-3 కూడా పాజిటివ్ రివ్యూలు, ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. 

ఈసారి కథను ఈశాన్య రాష్ట్రాల్లోకి మళ్లించిన రాజ్-డీకే.. ఏడు ఎపిసోడ్లను రసవత్తరంగా నడిపించి మెప్పించారు. కాకపోతే జైదీప్ అహ్లావత్ చేసిన విలన్ పాత్ర కొంచెం వీక్‌గా ఉండడం.. గత రెండు పార్ట్స్‌లో మాదిరి పెద్ద ట్విస్టుల్లేకపోవడం కొంతమేర ప్రేక్షకులను నిరాశపరిచినట్లు కనిపిస్తోంది. కానీ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయిందనడంలో మాత్రం సందేహం లేదు. ఎప్పట్లాగే కామెడీ, ఫ్యామిలీ డ్రామా పండడం.. దానికి తోడు థ్రిల్స్ కూడా ఉండడంతో సిరీస్ సాఫీగా సాగిపోయింది.

ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్-3’ క్లైమాక్స్ ప్రేక్షకులను కొంత అయోమయానికి గురి చేసింది. చివర్లో విలన్ని హీరో పట్టుకోలేకపోతాడు. మధ్యలో తీవ్రంగా గాయపడి ఊపిరి వదిలేసినట్లుగా మనోజ్‌ను చూపించే షాట్ దగ్గర సిరీస్‌ను ముగించారు. దీంతో శ్రీకాంత్‌కు ఏమైంది.. విలన్ ఏమయ్యాడు అనే ప్రశ్నలతో సిరీస్ ముగిసింది. మొత్తానికి సిరీస్‌కు రాజ్-డీకే శుభం కార్డు వేయలేదన్నది స్పష్టం. ‘ఫ్యామిలీ మ్యాన్-1’లోనూ ఇలాంటి ముగింపే ఉంటుంది. అందులో తలెత్తే ప్రశ్నలకు సీజన్-2లో జవాబిచ్చారు. 

ఇప్పుడు కూడా అదే స్టైల్ ఫాలో అయినట్లు కనిపిస్తోంది. వీలైనంత త్వరగా సీజన్-4ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు రాజ్-డీకే. అందులో ఈ కథకు ముగింపు ఇవ్వడమే కాక.. శ్రీకాంత్‌ను చివరగా ఇంకో మిషన్లోకి దించి అంతిమంగా ఈ సిరీస్‌‌కు ఎండ్ కార్డ్ వేస్తారనే చర్చ జరుగుతోంది. నాలుగో సీజన్ తర్వాత కూడా కథను కొనసాగిస్తూ టూమచ్ అవుతుందని.. అందుకే ఆ సీజన్‌తో ‘ఫ్యామిలీ మ్యాన్’ను మొత్తంగా ముగించేస్తారని అంటున్నారు.

This post was last modified on November 22, 2025 3:17 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

33 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago