నిన్న శుక్రవారం ఒకటి రెండు కాదు ఏకంగా పదికి పైగా సినిమాలు రిలీజయ్యాయి. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు పక్కనపెడితే అసలు దేనికీ సాలిడ్ ఓపెనింగ్స్ రాలేదు. ఉన్నంతలో హైదరాబాద్ లో ప్రీమియర్ వేయడం వల్ల రాజు వెడ్స్ రాంబాయికి బుకింగ్స్ జరుగుతున్నాయి కానీ మిగిలినవి మాత్రం ఫస్ట్ డే ఫిగర్స్ కోసం ఆపసోపాలు పడుతున్నాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ 12ఏ రైల్వే కాలనీ గురించి చెప్పాలి. చాలా చోట్ల పట్టుమని పాతిక శాతం ఆక్యుపెన్సీ లేదని ట్రేడ్ టాక్. ప్రమోషన్లు చేసినప్పటికీ అవి రొటీన్ గా ఉండటం, పబ్లిసిటీ మెటీరియల్ ఆకర్షణీయంగా లేకపోవడం జనంలో ఆసక్తి కలిగించలేదు.
చెప్పాలంటే ఇంత వీక్ ఓపెనింగ్ అల్లరి నరేష్ కు గతంలో లేదు. బచ్చలమల్లికి అంతో ఇంతో డీసెంట్ జనాలు కనిపించారు. హిట్టా ఫట్టా కాదు ఇక్కడ టాపిక్. జానర్లు మార్చుకుంటూ వెళ్తున్న అల్లరోడు ఇకపై కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రియదర్శి, ఆనంది జంటగా రూపొందిన ప్రేమంటే ఇంకా పూర్తి స్థాయిలో జనాన్ని రప్పించాల్సి ఉంది. హీరో హీరోయిన్ తో పాటు యాంకర్ సుమ యాక్టివ్ గా ప్రమోషన్లు చేయడంతో అంతో ఇంతో పబ్లిక్ దృష్టిలో పడింది. అయితే యునానిమస్ అనిపించుకుంటేనే గట్టెక్కే ఛాన్స్ ఉంటుంది. ఇక మిగిలిన సినిమాల గురించి డిస్కషన్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
విచిత్రంగా మంచి క్వాలిటీతో రీ మాస్టరింగ్ చేసుకున్న కొదమసింహం రీ రిలీజ్ సైతం ఎదురీదుతోంది. హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లో తప్ప మిగిలిన చోట్ల వసూళ్ల గురించి సైలెంట్ గా ఉండటం బెటర్. ఒక రకంగా బాక్సాఫీస్ డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. కంటెంట్ బాగుండాలి, జనాలకు పబ్లిసిటీ ద్వారా చేరువ కావాలి అనే మెసేజ్ ఇస్తోంది. రాజు వెడ్స్ రాంబాయి 99 రూపాయల టికెట్ స్ట్రాటజీ పని చేస్తోంది. వీకెండ్ డామినేషన్ ఖచ్చితంగా ఈ సినిమాదే కానుంది. ఆంధ్రకింగ్ తాలూకా వచ్చే వరకు థియేటర్ ఆడియన్స్ కి ఇదే ఫస్ట్ ఛాయస్. కాకపోతే ఈటీవీ విన్ కి లిటిల్ హార్ట్స్ రేంజ్ అవుతుందా లేదానేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates