రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ దగ్గరికి ఐబొమ్మ రవి అరెస్ట్ ప్రస్తావన వచ్చింది. సోషల్ మీడియాలో తనపై సానుభూతి పెరుగుతోందని, టికెట్ రేట్ల వల్లే జనాలు పైరసీకి అలవాటు పడిపోయి అతన్ని కొందరు హీరోలా చూడటం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. టికెట్ ధరలు ఒకటే సమస్య కాదని, పెద్దా చిన్నా తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయని, రేట్లు పెంచుకునేవి సంవత్సరంలో పది పదిహేను ఉంటే మిగిలినవన్నీ చిన్నవేనని, వాటి నిర్మాతలు ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలై వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారని, ఇది ఆలోచించాలని అన్నారు.
బన్నీ వాస్ చెప్పింది అక్షర సత్యం. అన్నీ పైరసీ బారిన పడుతున్నాయి. నిజమే. కానీ టికెట్ రేట్ల విషయంలో కొందరు నిర్మాతల అత్యాశ ప్రేక్షకులను కొన్ని వారాల పాటు థియేటర్లను దూరం చేస్తుందన్న విషయాన్ని విస్మరించకూడదు. ఉదాహరణకు ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్రీమియర్ కు వెయ్యి రూపాయలు ఒక్క టికెట్ మీద ఖర్చు పెట్టిన ప్రేక్షకుడు పెద్ద సినిమా లేకపోతే రెండు మూడు వారాలు థియేటర్ వైపుకు వెళ్లడం లేదు. అది పుష్ప కావొచ్చు ఓజి అవ్వొచ్చు. తర్వాత పది రోజుల పాటు యాభై నుంచి నూటా యాభై దాకా పెంపు ఉండటం వల్ల ఆ ప్రభావం లాంగ్ రన్ మీద ఉంటోందనేది కాదనలేని వాస్తవం.
కంటెంట్లు బాగుంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా బలగం నుంచి లిటిల్ హార్ట్స్ దాకా తెలుగు జనాలు చాలా బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అయిదేళ్ళు తీసిన హరిహర వీరమల్లుని తిరస్కరించారు. ఇవన్నీ పైరసీ బారిన పడినవే. ఆ భూతానికి హిట్టు ఫ్లాపు తేడా ఉండదు. ఇక రాజు వెడ్స్ రాంబాయికి 99 రూపాయల టికెట్ స్ట్రాటజి ఎంతగా గొప్పగా వర్కౌట్ అవుతోందో బుకింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ సాధారణంగా ఉండే 177, 200 ఉంటే ఇంత స్పందన ఉండేది కాదేమో. సో ఎప్పటికైనా ప్రొడ్యూసర్లు టికెట్ రేట్ల విషయంలో మరీ అత్యాశ పోకపోవడం అనేది ఇండస్ట్రీకి ఖచ్చితంగా మేలు చేస్తుంది.
This post was last modified on November 21, 2025 7:40 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…