నేనిలాగే ఉంటాను, ఇలాగే తీస్తాను అంటూ మాటకు కట్టుబడి ఫక్తు ఎంటర్ టైనర్లు ఇస్తూ సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారు తీస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికీ సాధ్యం కానీ చిరంజీవి – వెంకటేష్ కాంబోని నిజం చేయడం ద్వారా అభిమానుల అంచనాలు ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్లాడు. రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో పాటు రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, విజయ్ తదితరులతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఫ్యామిలీ ఆడియన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టేస్తాననే నమ్మకంతో షూటింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా అనిల్ రావిపూడితో చేయాలని వెయిట్ చేస్తున్న హీరోలు చాలానే ఉన్నారు. తమ హీరోలోని ఎనర్జీని కరెక్ట్ గా వాడుకునే దర్శకుడు అతనేనంటూ రామ్ అభిమానులు ఫీలవుతూ ఉంటారు. ఇటీవలే సరిగమా షోకు జడ్జిగా వచ్చిన రావిపూడి తమ కాంబో గురించి ఒక హింట్ అయితే ఇచ్చారు. రామ్ తో సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, వస్తే మాత్రం బద్దలవ్వాల్సిందేనని అనేశారు. అంటే ఏదో స్ట్రాంగ్ పాయింట్ మనసులో ఉండే ఉంటుంది. లేకపోతే నా చేతిలో ఏముంది, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పేవారుగా. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఈ కలయికని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
ఇక రామ్ విషయానికి వస్తే ఆంధ్రకింగ్ తాలూకాతో మళ్ళీ కంబ్యాక్ అవుతానని బలంగా నమ్ముతున్నాడు. పాటలు, ట్రైలర్ ఆల్రెడీ పాజిటివ్ వైబ్స్ సృష్టించాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు టేకింగ్ చూసి హిట్టు ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. శంకరవరప్రసాద్ గారు తర్వాత రావిపూడి ఎవరితో చేస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బాలయ్యతో ఉండొచ్చని అంటున్నారు కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అదేదో రామ్ తో చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కానీ టాలీవుడ్ కాంబినేషన్లు ఎప్పుడు ఎలా ఎక్కడ మొదలవుతాయో వెంటనే చెప్పలేం.
This post was last modified on November 21, 2025 10:48 am
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…