దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది తెలుగమ్మాయి చాందిని చౌదరి. సినిమాల్లోకి రావడంలో ఆలస్యం జరిగింది కానీ.. అంతకుముందే ఆమె షార్ట్ ఫిలిమ్స్‌తో సత్తా చాటింది. యూట్యూబ్‌లో ఆమె ఒక స్టార్ అంటే అతిశయోక్తి కాదు. వెండితెరలో అడుగు పెట్టడానికి ముందే మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాందిని.. ఇక సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు ఇక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. హీరోయిన్‌గా చేసిన ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. పెద్ద సినిమాల్లో సైడ్ రోల్స్ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, మను.. ఇలా చాందిని కథానాయికగా నటించిన సినిమాలు కనీస స్పందన కూడా తెచ్చుకోలేదు. ఐతే ఎట్టకేలకు ఆమె కోరుకున్న బ్రేక్ లభించినట్లే ఉంది. ‘కలర్ ఫోటో’ ఆమెకు మంచి పేరు తెచ్చింది. ‘ఆహా’లో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
పేరున్న హీరోలు, దర్శకులతో సినిమాలు చేయాలన్న చాందిని ఆశ ఎట్టకేలకు ఫలించింది. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో చాందిని ‘సూపర్ ఓవర్’ అనే సినిమా చేయబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా చాందినినే వెల్లడించింది. దీంతో పాటు యువ కథానాయకుడు విశ్వక్సేన్‌తో ‘ప్రాజెక్ట్ గామి’ అనే సినిమాను కూడా ఓకే చేసినట్లు ఆమె తెలిపింది.
ఇవీ మరీ పెద్ద సినిమాలు కావు కానీ చాందిని ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే వీటి రేంజ్ ఎక్కువే. వేరే సినిమాలు కూడా కొన్ని చర్చల దశలో ఉన్నాయని.. వచ్చే ఏడాది కాలానికి తన కాల్ షీట్లు ఖాళీగా లేవని.. సినీ రంగంలో తాను ఆరేళ్ల పాటు పడ్డ కష్టానికి ఫలితం ఇదని.. గతంలో తాను చేసిన సినిమాల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయని.. అలాగే కొన్ని సినిమాలకు ఎంపిక చేసినట్లే చేసి తప్పించారని.. ఈ అనుభవాల తర్వాత ఒక దశలో పరిశ్రమను వదిలేద్దామనిపించిందని.. కానీ తట్టుకుని నిలబడి ఈ రోజు మంచి స్థాయిని అందుకున్నానని చాందిని చెప్పింది.
This post was last modified on December 4, 2020 1:33 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…