సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లలో తెలుగు సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లు వేరు. ఒకప్పుడు ఆడియో వేడుకలుగా ఉన్న వాటినే తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్లుగా మార్చారు. ఐతే పేరు మారింది కానీ.. ఈవెంట్లు జరిగే తీరు మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది. సాయంత్రం మొదలుపెట్టి లేట్ నైట్ వరకు సుదీర్ఘంగా సాగే ఈ ఈవెంట్లు స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు ఎలా అనిపిస్తాయో కానీ.. మిగతా వాళ్లకు మాత్రం ప్రసహనంలా అనిపిస్తాన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది.
ఇండస్ట్రీ జనాలు మాత్రం దాని గురించి ఓపెన్‌గా మాట్లాడరు. కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడని పేరున్న సీనియర్ నటుడు, దర్శకుడు రవిబాబు మాత్రం ఈ ఈవెంట్ల మీద కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పాడు. ఈ ఈవెంట్లు జరిగే తీరు తీవ్ర అసహనాన్ని కలిగిస్తుందని.. ఇలాంటి ఈవెంట్లు ప్రపంచంలో ఇంకెక్కడా చూడమని అతనన్నాడు.
ప్రి రిలీజ్ ఈవెంట్లు అంటే ఒకరినొకరు పొగుడుకోవడం.. అక్కడున్న జనం అవసరం లేకపోయినా అరవడం.. ఒక్కొక్కరి గురించి ఏవీలు వేసి ఎలివేషన్లు ఇవ్వడం.. స్టేజ్ మీదికి వచ్చే వాళ్లకు ఏం చేయాలో కూడా తెలియకపోవడం.. వారిని యాంకర్లు గైడ్ చేయడం.. ఇలా మొత్తంగా ఈ ఈవెంట్లు విపరీతమైన అసహనాన్ని కలిగించేలా సాగుతాయని రవిబాబు అన్నాడు. హాలీవుడ్లో ఎప్పుడైనా స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి ఈవెంట్లు చూశారా అని రవిబాబు ప్రశ్నించాడు. వాళ్లు మన హీరోల కంటే పెద్ద స్టార్స్ అని.. కానీ వాళ్లు టీవీ షోలకు వచ్చి సింపుల్‌గా సినిమాల ప్రమోషన్ చేస్తారు తప్ప.. ఇలాంటి ఈవెంట్లతో విసిగించరని రవిబాబు అన్నాడు.
మరోవైపు తెలుగు సినిమాల్లో ఆర్టిస్టుల నటన గురించి కూడా రవిబాబు స్పందించాడు. ఇక్కడ ఓవరాక్షన్ చేస్తేనే మంచి నటుడు అంటారని ఆయన అభిప్రాయపడ్డాడు. హీరోల్లో చాలామందికి ఇలాగే పేరు వచ్చిందని రవిబాబు అన్నాడు. తనను నటుడిగా గుర్తించడం లేదని.. ‘మురారి’ సినిమాలో ఓవరాక్షన్ చేశానని, పిచ్చి పిచ్చి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చానని.. అప్పుడు అందరూ భలే నటుడు దొరికాడురా అంటూ తనను పొగిడారని రవిబాబు చెప్పడం విశేషం.
This post was last modified on November 20, 2025 6:45 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…