క్యారెక్టర్ ఆర్టిస్టు తులసి గారు డిసెంబర్ 31 తర్వాత సినిమాలకు స్వస్తి చెబుతానని, ఇకపై నటించబోనని, సాయిబాబా సేవలో కాలం గడుపుతానని ప్రకటించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అసలే ఇప్పుడు నటీమణుల కొరత తీవ్రంగా ఉంది. యాక్టింగ్ చేయడం, చేయకపోవడం ఆవిడ వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ మరికొంత కాలం కొనసాగి ఉండాలని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే విడుదలైన లవ్ ఓటీపీ, కృష్ణలీలలో తులసి నటించారు. ఈవిడ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందో తెలియాలంటే తులసి నేపథ్యం అర్థం చేసుకోవాలి.
మూడు నెలల వయసప్పుడే 1967లో జీవన తరంగాలులో తులసి మొదటిసారి కనిపించారు. తరువాత ఆరేళ్ళ వయసొచ్చాక తమిళ సినిమా అరంగేట్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. చిల్లరకొట్టు చిట్టెమ్మతో తొలి అడుగు పడగా కె విశ్వనాథ్ వరసగా ఇచ్చిన రెండు అవకాశాలు సీతామాలక్ష్మి, శంకరాభరణం బాలనటిగా ఆమె కెరీర్ ని గొప్ప మలుపు తిప్పాయి. అక్కడి నుంచి చాలా హిట్ మూవీస్ చేశారు,. కోతల రాయుడు, న్యాయం కావాలి, ముద్దమందారం, రామదండు, త్రిశూలం, శుభలేఖ వగైరాలు మంచి పేరు తీసుకొచ్చాయి. చంద్రమోహన్ కాంబినేషన్ లో హీరోయిన్ గా నటించిన ముచ్చటగా ముగ్గురు లాంటి సక్సెస్ లు ఆ టైంలోనే దక్కాయి.
తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ కలిపి సుమారు మూడు వందలకు పైగా సినిమాలు చేసిన తులసి హీరో హీరోయిన్ల తల్లిగా వదినగా చాలా పాత్రలు చేసి ఇప్పటి ఆడియన్స్ కి దగ్గరయ్యారు తులసి భర్త కన్నడ దర్శకుడు శివమణి. ప్రస్తుతం జైలులో ఉన్న శాండల్ వుడ్ స్టార్ దర్శన్ కొత్త సినిమా డెవిల్ లోనూ తులసి ఉన్నారు. బహుశా రిటైర్మెంట్ కు ముందు ఇదే చివరి మూవీ కావొచ్చు. ప్రస్తుతం ఈవిడ వయసు 58. ఇంకా చురుకుగా ఉన్నప్పటికీ తన ఇష్టదైవం సేవలో మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న తులసి రెండుసార్లు నంది అవార్డు, ఒకసారి ఫిలిం ఫేర్ అందుకున్నారు.
This post was last modified on November 19, 2025 3:24 pm
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…