Movie News

ఇంత సైలెంట్ అయితే ఎలా రాజ్

ఉయ్యాలా జంపాలతో మొదలుపెట్టి కుమారి 21 ఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న యూత్ హీరో రాజ్ తరుణ్ కు తర్వాత తిరుగులేదని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ వరస ఫ్లాపులతో కుర్రాడు మార్కెట్ ని రిస్క్ లో పెట్టేసుకున్నాడు. గత రెండేళ్లలో అతని సినిమాలు ఎన్ని రిలీజయ్యాయో ఠక్కున చెప్పడం కష్టం. కౌంట్ పెద్దదే కానీ ఏదీ కనీస ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ మధ్యే ఆహాలో చిరంజీవ అనే టైటిల్ తో ఓటిటి మూవీ చేశాడు. వ్యూస్ వచ్చినట్టున్నాయి కానీ సోషల్ మీడియాలో టాక్ అవ్వలేదు. నెటిజెన్ల దృష్టిలో పెద్దగా పడలేదు. రివ్యూలు కూడా సోసోగా రావడంతో అంత మంచి టైటిలున్నా నిలబడలేదు.

వీటి సంగతలా ఉంచితే రాజ్ తరుణ్ కొత్త సినిమా పాంచ్ మినార్ నవంబర్ 21 వస్తోంది. ఆ రోజు చాలా కాంపిటీషన్ ఉంది. అల్లరి నరేష్ 12 ఏ రైల్వేకాలనీ, ప్రియదర్శి ప్రేమంటేతో పాటు రాజు వెడ్స్ రాంబాయి, మఫ్టీ పోలీస్ లాంటి కంటెంట్లను నమ్ముకున్న అరడజను చిత్రాలు రేసులో ఉన్నాయి. వీటిలో మొదటి మూడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసుకున్నాయి. ప్రేమంటేకి నాగచైతన్యని గెస్టుగా తీసుకొచ్చి ఆడియన్స్ దృష్టిలో పడేలా చేశారు. రాంబాయి కోసం రేపు కిరణ్ అబ్బవరం వస్తున్నాడు. రైల్వేకాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి హరీష్ శంకర్ లాంటోళ్లను గెస్టుగా తేవడం ద్వారా అటెన్షన్ పెంచుకున్నారు.

పాంచ్ మినార్ కు కూడా చేశారు కానీ ఆడియన్స్ దృష్టిలో పూర్తిగా పడలేదు. కంటెంట్ మీద నమ్మకంతో రేపే పలు కేంద్రాల్లో ప్రీమియర్లు వేస్తున్నారు. సక్సెస్ కోసం తపించిపోతున్న రాజ్ తరుణ్ ఈసారి గ్యారెంటీ హిట్టు అంటున్నాడు. రామ్ కడుముల దర్శకత్వం వహించిన పాంచ్ మినార్ కు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. అయినా ఏదో ఒక హడావిడితో వైరలయ్యేలా పబ్లిసిటీ చేస్తే తప్ప చిన్న సినిమాల వైపు జనం చూడటం లేదు. అలాంటిది పాంచ్ మినార్ రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్లడం సరిపోదు. ఇంకేదైనా క్రియేటివ్ గా చేయాలి. చూడాలి ఈసారైనా రాజ్ తరుణ్ ని విజయలక్ష్మి వరిస్తుందో లేదో.

This post was last modified on November 19, 2025 10:50 am

Share

Recent Posts

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

16 minutes ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

1 hour ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

2 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

4 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

4 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

4 hours ago