మొన్న విడుదలైన కొత్త సినిమాల్లో అంతో ఇంతో మంచి అంచనాలున్న కాంత బాక్సాఫీస్ ఫలితం నిరాశ పరిచింది. తమిళంలో బాగానే ఆడుతున్నా తెలుగులో ఇలాంటి రిజల్ట్ ఊహించలేదని దగ్గుబాటి రానా స్వయంగా ఒప్పుకోవడం చూస్తే ఫైనల్ రన్ త్వరగానే వచ్చేలా ఉంది. నిన్న వీకెండ్ ఓ మాదిరి ఆక్యుపెన్సీలు కనిపించాయి తప్ప ఎక్కడా హౌస్ ఫుల్స్ నమోదు కాలేదు. తమిళ నేటివిటీతో పాటు అధిక శాతం మూవీ ఇంటీరియర్ లో సాగుతూ ల్యాగ్ ఎక్కువైపోవడంతో మన ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ టాలీవుడ్ జనాలకు నచ్చేలా చేయడంలో దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ విఫలమయ్యాడు.
సో కాంత మన దగ్గర వెనుకబడి పోయినట్టే. దుల్కర్ సల్మాన్ కు యావరేజ్ లేదా ఫ్లాప్ దక్కుతుంది తప్ప హిట్టు ఛాన్స్ లేదనిపిస్తోంది. ఇక సంతాన ప్రాప్తిరస్తుని ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి చిన్న సినిమాలకు టాక్స్, రివ్యూస్ కీలకం. అవి కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో టికెట్ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. డిఫరెంట్ పాయింట్ తీసుకున్నారు కానీ అది సామాన్య జనాలకు కనెక్ట్ అయ్యేది కాదనేది మేకర్స్ గుర్తించలేకపోయారు. జిగ్రీస్ కొంచెం మెరుగనే మాట యూత్ లో అనిపించుకున్నా ఫైనల్ గా అది కూడా సోసోగానే సెలవు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఎవరూ ఊహించనిది శివ జాతర.
4కె రీ మాస్టరింగ్, డాల్బీ మిక్సింగ్ లో అన్నపూర్ణ స్టూడియోస్, రామ్ గోపాల్ వర్మ తీసుకున్న శ్రద్ధ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. నిన్న మెయిన్ సెంటర్స్ చాలా చోట్ల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయి. దేవి లాంటి థియేటర్లు పండగ వాతావరణాన్ని తలపించాయి. 1989 నాటి సినిమా అయినప్పటికీ కొత్త ఫీలింగ్ కలిగించేలా చేయడంతో యంగ్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇళయరాజా పాటలు, ఏఐ వాడి రీమిక్స్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్ తో రిపీట్ వాచ్ చేయిస్తున్నాయి. ఫైనల్ ఫిగర్ ఏడెనిమిది కోట్ల దాకా రావొచ్చని అంచనా. ఏదేమైనా ఫ్రైడే రిజల్ట్స్ మాత్రం షాకింగ్ గా వచ్చాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates