సూపర్ స్టార్ కృష్ణ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని కెరీర్ ఆరంభంలోనే పేరు సంపాదించాడు మహేష్ బాబు. కొన్నేళ్లకు తండ్రికి మించిన తనయుడు అని కూడా అనిపించుకున్నాడు. తండ్రికి ఉన్న సూపర్ స్టార్ బిరుదును అభిమానులు కొడుక్కీ ఇచ్చేశారు. ఇప్పుడు మహేష్ బాబు గ్లోబల్ స్థాయికి వెళ్లబోతున్నాడు.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలల కాంబినేషన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న సినిమా కొన్ని నెలల కిందటే పట్టాలెక్కింది. ఈ రోజు ఆ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో ఎమోషనల్ అయిన మహేష్ బాబు.. ఎక్స్ వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు.
తండ్రితో కలిసి నటించిన ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా కలిసి ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటోను మహేష్ పంచుకున్నాడు. ‘‘ఈ రోజు నిన్ను ఇంకొంచెం ఎక్కువగా తలుచుకుంటున్నా. నువ్వు ఉండి ఉంటే ఎంతో గర్వించేవాడివి నాన్న’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా జోడించాడు మహేష్ బాబు. పిల్లలు తమను మించి ఎదిగినపుడు.. వారి ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతున్నపుడు తల్లిదండ్రులకు అంతకుమించిన ఆనందం ఉండదు.
కెరీర్లో మహేష్ ఒక్కడు, దూకుడు లాంటి భారీ విజయాలు అందుకుని గొప్ప స్థాయికి చేరుకున్నపుడు కృష్ణ ఎంత ఆనందించారో అందరికీ తెలిసిందే. ఐతే రాజమౌళితో సినిమా ద్వారా ఇప్పుడు మహేష్ మరెన్నో మెట్లు ఎక్కేయబోతున్నాడు. ఈ సమయంలో కృష్ణ ఉంటే ఆయన ఆనందానికి అవధులు ఉండేవి కావు. ఆ విషయమే తలుచుకుని మహేష్ ఎమోషనల్ అయినట్లున్నాడు. ఇది కృష్ణ, మహేష్ అభిమానులందరినీ కూడా ఉద్వేగానికి గురి చేస్తోంది.
This post was last modified on November 15, 2025 3:07 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…