ఇండస్ట్రీని ప్రధానంగా వేధిస్తున్న సమస్యల్లో పైరసీ చాలా తీవ్రమైంది. ఎన్ని చర్యలు తీసుకున్నా రూపం మార్చుకుంటోంది తప్ప తన పనిని ఆపడం లేదు. ఆ మధ్య హైదరాబాద్ పోలీసులు ఒక పెద్ద రాకెట్ ని ఛేదించి కొందరిని అరెస్ట్ చేశారు. అయినా ఈ భూతం కొనసాగుతూనే ఉంది. అయితే ఆన్ లైన్ పైరసీ అధిక శాతం టొరెంట్ లింక్స్, టెలిగ్రామ్ యాప్స్ ఆపరేట్ చేయడం తెలిసిన వాళ్లకు మాత్రం డౌన్లోడ్ అయ్యేది. అందుకే సగటు సామాన్యులు వీటికి దూరంగా ఉండేవాళ్ళు. ఈ వర్గాన్ని టార్గెట్ చేసుకుని తెచ్చిన సులభతరమైన యాప్ ఐ బొమ్మ అతి తక్కువ టైంలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
ఎక్కడో విదేశాల్లో ఉంటూ కొత్త సినిమాలను పైరసీ చేస్తూ ఉచితంగా ఐ బొమ్మ యాప్ లో పెడుతున్న నిర్వాహకులను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. విదేశీ చట్టాల్లోని లొసుగులు వాడుకుంటూ ఇన్నాళ్లు తప్పించుకుంటూ ఉన్నారు. పై పెచ్చు నిర్మాతలను తమ సైట్ లో బహిరంగంగా బెదిరించడం కవ్వించడం లాంటివి కూడా చాలా చేశారు. తాజాగా ప్రాన్స్ నుంచి వచ్చిన ఐబొమ్మ యజమాని ఇమ్మడి రవిని హైదరాబాద్ కూకట్ పల్లి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడే పైరసీని ఆపరేట్ చేస్తున్న ఇతని మీద ప్రొడ్యూసర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి.
ఇప్పుడీ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం ద్వారా మరో పెద్ద డొంకని కదిలించినట్టే. మరిన్ని వివరాలు విచారణలో బయట పడబోతున్నాయి. అతని బ్యాంకు అకౌంట్లలో ఉన్న మూడు కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టు ప్రాధమిక సమాచారం. వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళను బయటికి రాకుండా కఠిన శిక్ష పడేలా చేస్తే ఇతరులకు భయం ఉంటుంది. వేల కోట్ల రూపాయల నష్టాన్ని పరిశ్రమకు కలగజేస్తున్న ఐబొమ్మ లాంటి అనధికార యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించాలి. సదరు ఇమ్మడి రవి నుంచి దీనికి సంబంధించిన కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on November 15, 2025 11:50 am
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…