15 ఏళ్ల కెరీర్.. 20 సినిమాలు.. అందులో హిట్లు అని చెప్పుకోదగ్గవి కేవలం మూడు సినిమాలు మాత్రమే. మిగతావన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. ఇదీ సుధీర్ బాబు పరిస్థితి. మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నా.. కథల ఎంపికలో తన అభిరుచిని చాటుకున్నా.. సక్సెస్ మాత్రం అతడితో దోబూచులాడుతూనే ఉంది. ‘సమ్మోహనం’ సినిమా అతడికి పెద్ద బ్రేక్ ఇచ్చి కెరీర్‌కు మంచి ఊపు తీసుకొచ్చింది కానీ.. దాన్ని సుధీర్ నిలబెట్టుకోలేకపోయాడు.
సమ్మోహనం తర్వాత పది సినిమాల్లో నటిస్తే ‘నన్ను దోచుకుందువటే’ మాత్రమే ఓ మాదిరిగా ఆడింది. మిగతావన్నీ ఫ్లాపులే. అందులోనూ గత మూణ్నాలుగేళ్లలో సుధీర్ బాబుకు మామూలు షాకులు తగల్లేదు. ‘మామా మశ్చీంద్ర’ తన కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాగా నిలిచింది. ‘హరోం హర’, ‘మా నాన్న సూపర్ హీరో’ మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఆడలేదు. తాజాగా ‘జటాధర’ సినిమా సుధీర్ కెరీర్‌ను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిపోయింది.
ఎవరైనా కష్టాల్లో ఉంటే దేవుడే దిక్కు అంటారు. కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న సుధీర్.. దేవుడినే నమ్ముకున్నాడు. ట్రెండుకు తగ్గట్లుగా దేవుడు-దయ్యం కాన్సెప్ట్‌తో ‘జటాధర’ చేశాడు. కానీ సుధీర్‌ను దేవుడు కూడా కాపాడలేకపోయాడు. ట్రైలర్ చూసి ఏదో అనుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు మామూలు షాక్ తగల్లేదు. సుధీర్ కెరీర్లో అట్టడుగున నిలవడానికి బలమైన పోటీదారుగా మారిందీ చిత్రం. అంతగా టార్చర్ పెట్టిన సినిమా ఇది.
ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ లేవు. వీకెండ్లోనే సినిమా వాషౌట్ అయిపోయింది. ఈ సినిమా చూశాక సుధీర్ కెరీర్ ఇక పుంజుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన జడ్జిమెంట్ మీదా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ స్థితిలో సుధీర్ సినిమాలకు ఓ మోస్తరు బడ్జెట్లు పెట్టడం.. వాటిని మార్కెట్ చేయడం కూడా కష్టంగా కనిపిస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో సుధీర్ తన తర్వాతి సినిమా చేయాల్సి ఉంది. మరి ‘జటాధర’ షాక్ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు ముందుకు కదిలి సుధీర్‌కు అవసరమైన బ్రేక్ లభిస్తుందా అన్నది చూడాలి.
This post was last modified on November 13, 2025 7:09 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…