కంటెంట్ ఉంటే యాక్టర్స్ తో సంబంధం లేకుండా చిన్న సినిమాలైనా బాగా ఆడతాయనే నమ్మకాన్ని బలగం నుంచి లిటిల్ హార్ట్స్ దాకా ఎన్నో కలిగించాయి. రాజు వెడ్స్ రాంబాయి టీమ్ కూడా తమ మూవీ మీద అంతే నమ్మకంతో ఉంది. నవంబర్ 21 విడుదల కాబోతున్న ఈ విలేజ్ డ్రామాని విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించడం విశేషం. ఈటీవీ విన్ అండదండలతో థియేటర్ రిలీజ్ జరుపుకోబోతున్న రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్ ఇవాళ లాంచ్ చేశారు. టైటిల్ సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ కాగా కథ పరంగా ఏముందో ఎక్కువ దాచకుండా మూడున్నర నిమిషాల వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు.
ఆదో పల్లెటూరు. పండగలకు పబ్బాలకు డ్రమ్ములు వాయించే రాజు (అఖిల్ రాజ్) అంటే ఊళ్ళో అమ్మాయిలకే భలే క్రేజ్. కాలేజీలో చదువుకునే రాంబాయి (తేజస్వి రావు) ముందు రాజుని తిట్టుకున్నా క్రమంగా అతని ప్రేమలో పడుతుంది. గర్భం దాలిస్తే పెద్దలు పెళ్ళికి ఒప్పుకుంటారనే అమాయకత్వంలో ఇద్దరూ ఒక్కటవుతారు. అయితే వీళ్ళ ప్రేమ వ్యవహారం రాంబాయి తండ్రికి తెలిశాక వ్యవహారం సీరియస్ గా మారుతుంది. ఇంకోవైపు ఈమె దక్కదనే భయంతో రాజు అతిప్రేమతో వయొలెంట్ గా మారి ప్రియురాలిని కొట్టేందుకు కూడా వెనుకాడడు. చివరికి ఏం జరిగిందో థియేటర్ లో చూడాలి.
రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాగా దర్శకుడు సాయిలు కాంపతి తెరకెక్కించిన తీరు ఇలాంటి ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది . సురేష్ బొబ్బిలి సంగీతం, ఆర్టిస్టుల సహజ నటన ప్లస్ అవుతున్నాయి. స్టోరీ చెప్పినట్టే ఉంది కానీ ముఖ్యమైన ట్విస్టులను మాత్రం రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. తండ్రి, ప్రియుడి మధ్య నలిగిపోయే అమ్మాయి సంఘర్షణని కథగా చెప్పారు కానీ దాచిపెట్టిన ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్టున్నాయి. ప్రమోషన్ల పరంగా బాగానే కష్టపడుతున్న రాజు వెడ్స్ రాంబాయి లవ్ స్టోరీ కంచికి చేరుతుందో లేదో వచ్చే శుక్రవారం తేలనుంది.
This post was last modified on November 13, 2025 6:43 pm
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…