ఒక సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి సిద్ధమైంది మహేష్ బాబు-రాజమౌళి చిత్ర యూనిట్. షూటింగ్ మొదలై చాన్నాళ్లయినా ఇప్పటిదాకా ఈ సినిమా విశేషాలేమీ పంచుకోని సంగతి తెలిసిందే. ఈ నెల 15న టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కొన్ని వారాల ముందే పనులు మొదలయ్యాయి.
ఈ ఈవెంట్‌కు వారం ముందు నుంచి వేరే అప్‌డేట్స్ ఇస్తోంది చిత్ర బృందం. వీటికి మంచి స్పందనా వస్తోంది. ఇక ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఈవెంట్ ఎలా ఉండబోతోందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్‌ను విశాల ప్రాంగణంలో నిర్వహించబోతున్నారు. అక్కడ ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ నిర్మాణం కూడా జరుగుతోంది. దాదాపు లక్షమంది అభిమానుల మధ్య ఈ వెంట్ చేయాలనుకున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సాఫీగా సాగిపోతున్న వేళ.. దేశంలో అలజడి నెలకొంది.
దిల్లీలో కారు బాంబు పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా హై అలెర్ట్ నెలకొంది. మెట్రో నగరాలన్నింటినీ అప్రమత్తం చేశారు. ఆ సిటీస్ కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లాయి. ఉగ్రవాదులు మరిన్ని పేలుళ్లకు కుట్ర చేశారన్న సమాచారంతో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంత భారీ జనంతో ఈవెంట్ నిర్వహించడం సాధ్యమా.. అందుకు అనుమతులు లభిస్తాయా అన్నది అనుమానంగా మారింది. మహేష్ బాబు, రాజమౌళి సహా ఎంతోమంది వీఐపీలు ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
ఈ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సి ఉంటుంది. లక్షమంది కాకపోయినా 50-60 వేల మంది జనాన్నయైనా కంట్రోల్ చేయడం, ఈవెంట్ సాఫీగా నిర్వహించడం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేసే పరిస్థితి వస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈవెంట్‌ను వాయిదా వేయలేని పరిస్థితులు ఉంటే.. అభిమానుల సంఖ్యను బాగా తగ్గించి.. చిన్న స్థాయిలో చేసుకోవాలనే ఆదేశాలు రావచ్చు. భద్రత బలగాలను కూడా బాగా తగ్గించే అవకాశాలున్నాయి.
This post was last modified on November 13, 2025 9:52 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…