కొన్ని నెలల క్రితం రీ రిలీజ్ జరుపుకున్న జగదేకవీరుడు అతిలోకసుందరికి అభిమానుల నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా అపూర్వమైన మద్దతు దొరికింది. అయితే వైజయంతి మూవీస్ సంస్థ ఎంత కస్టపడి రీ మాస్టరింగ్ చేసినా దాని క్వాలిటీకి పెదవి విరుపులే ఎక్కువ వినిపించాయి. నెగటివ్స్ మరీ దారుణంగా పాడైపోవడంతో వాటికి పూర్వ స్థితికి తేవడం టీమ్ కు సవాల్ గా మారింది. అయినా కూడా ఎఫర్ట్స్ చాలా పెట్టారు కానీ పూర్తి ప్రయోజనం కలగలేదు. దానికున్న వింటేజ్ స్టేటస్, చిరు శ్రీదేవి జోడి, ఇళయరాజా పాటలు జనాన్ని థియేటర్లకు వచ్చేలా చేశాయి. నాణ్యత విషయంలో అసంతృప్తి అలాగే ఉండిపోయింది
ఇప్పుడా కొరతను తగ్గించేందుకా అన్నట్టు నవంబర్ 21 కొదమసింహం రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రత్యేకంగా దీని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ట్రైలర్ లో చూపించిన విజువల్స్, క్వాలిటీకి వావ్ అనకుండా ఉండలేం. అంత బాగా రీ మాస్టరింగ్ చేశారు. ఆర్టిస్టుల హావభావాలు, బ్యాక్ గ్రౌండ్, డీటెయిల్స్ అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. 1990లో వచ్చిన ఈ కౌబాయ్ మూవీ మొదటిసారి విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. క్రమంగా కాలం గడిచే కొద్దీ కల్ట్ స్టేటస్ సంపాదించుకుని మూవీ లవర్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
సినీ విశ్లేషకులు కొదమసింహం రికమండ్ చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. కౌబాయ్ గా చిరంజీవి స్టైల్, స్వాగ్ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది ఫైట్స్, ఛేజులు, డాన్సుల్లో ఆయన హుషారు నెక్స్ట్ లెవెల్ లో చూడొచ్చు. రాజ్ కోటి పాటలు, కె మురళీమోహన్ రావు దర్శకత్వం, దత్తు కెమెరా పనితనం ఒకదానితో మరొకటి పోటీ పడతాయి. కొదమసింహంలో ఎడారి ఎపిసోడ్ ని స్ఫూర్తిగా తీసుకునే రాజమౌళి తన మగధీరలో రామ్ చరణ్ గుర్రం మధ్య ఎడారి సీన్ పెట్టారు. ఇది స్వయంగా ఆయన చెప్పిన విశేషమే. సో మెగా ఫ్యాన్స్ నోస్టాల్జియాగా ఫీలైతే మూవీ లవర్స్ కి ఒక స్పెషల్ మెమరీగా కొదమసింహం నిలవనుంది.
This post was last modified on November 12, 2025 10:39 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…