బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు సీఐడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “మొదట అది గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశాను. తర్వాత అది బెట్టింగ్ యాప్ అని తెలిసిన వెంటనే తప్పుకున్నాను. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నేను చేసినది తప్పు అని ఒప్పుకుంటున్నాను” అన్నారు.
అలాగే ఆయన పేర్కొంటూ, “2016లో నేను ఆ యాప్‌కు ప్రమోషన్ చేశాను. 2017లో ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం విధించింది. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇలాంటి యాప్స్‌ను ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. యువత కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకూడదు” అని సూచించారు.
మియాపూర్, సైబరాబాద్ ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు సీఐడీకి బదిలీ అయ్యాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే కేసులో గత జూలై 30న ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు.
This post was last modified on November 12, 2025 10:04 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…