బాహుబలి తర్వాత చేసిన సాహో అంచనాలను అందుకోలేదు. రాధేశ్యామ్ మీద అంచనాలు మరీ ఎక్కువగా ఏమీ లేవు. దీంతో ప్రభాస్ ఊపు తగ్గినట్లే అనుకున్నారంతా. కానీ గత కొన్ని నెలల్లో ఒకదాని తర్వాత ఒకటిగా అతను అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు చూసి అందరికీ దిమ్మదిరిగిపోతోంది. క్రేజీ కాంబినేషన్లలో మూడు భారీ చిత్రాలను లైన్లో పెట్టాడతను. ఒక్కో సినిమా అనౌన్స్ చేయగానే జనాలు ఔరా అనుకుంటూ చూస్తున్నారు. వాటిపై పెద్ద డిస్కషన్లు పెడుతున్నారు. అతను సెట్ చేసుకుంటున్న కాంబినేషన్ల మీద నడుస్తున్న చర్చకు తోడు.. ఏ సినిమా ఎప్పుడు చేస్తాడన్నది మరో డిస్కషన్ పాయింట్ అవుతోంది.
ఒక హీరో ముందు అనౌన్స్ చేసిన సినిమాను ముందు పట్టాలెక్కిస్తాడనే అంతా అనుకుంటారు. కానీ ప్రభాస్ తీరు దీనికి భిన్నంగా ఉంటోంది. ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో మొదలు కాబోదని స్పష్టంగా తెలుస్తోంది. దాని కంటే ముందు ఓం రౌత్ దర్శకత్వంలో చేయబోయే ఆదిపురుష్ షూటింగ్‌కు వెళ్తుందని అన్నారు. ఆ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేస్తారని 2021లోనే రిలీజ్ అని ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యే ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అది 2022 మధ్యకు వెళ్లిపోయింది. చిత్రీకరణ ఆలస్యం కావడం వల్లే రిలీజ్ లేటేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఆ సినిమా చిత్రీకరణ జనవరి నుంచే మొదలని మేకర్స్ ప్రకటించారు. దీనికి స్క్రిప్టు రెడీగా ఉందని.. ప్రభాస్ ఆరు నెలల్లో ఈ సినిమాను ముగించేసి తర్వాత ఆదిపురుష్ మీదికి వెళ్తాడని తాజాగా అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్లానింగ్, అతడి చర్యలు ఊహాతీతమని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోందిప్పు
This post was last modified on December 2, 2020 8:33 pm
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…