ఒక పెద్ద హీరో కొడుకు ఇండస్ట్రీలోకి వస్తున్నాడంటే.. ఆటోమేటిగ్గా తండ్రి పేరును వాడుకోవడం మామూలే. తండ్రి రెఫరెన్సులు పెట్టడం అతడి గొప్పదనాన్ని చాటుతూనే.. మరోవైపు ఆ రెఫరెన్సులను తన కెరీర్ కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. తండ్రిని అనుకరించడం ద్వారా తాను ఫలానా వ్యక్తి కొడుకుననే విషయాన్ని అభిమానుల్లో బలంగా నాటుకుపోయేలా చేస్తారు.
కానీ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మాత్రం ఇందుకు భిన్నం. లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు అనే గుర్తింపుతో కెరీర్ ఆరంభంలో కొన్ని అవకాశాలు అందుకున్నప్పటికీ.. తర్వాతి కెరీర్ అంతా తన ఘనతే. అతను తండ్రిని ఏమాత్రం అనుకరించకుండా.. ఆయన రెఫరెన్సులు వాడకుండా.. సొంతంగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ నటుల్లో ఒకడిగా పేరు సంపాదించాాడు.
దుల్కర్ కెరీర్ మొదలై 15 ఏళ్లు కావస్తుండగా.. ఇప్పటిదాకా తండ్రితో కలిసి అతను నటించలేదు. దుల్కర్ సినిమాల్లో ఏ రకంగానూ మమ్ముట్టి అసోసియేట్ కాలేదు. ఐతే ఎట్టకేలకు వీరి కాంబినేషన్ ఖరారైంది. దుల్కర్ నిర్మాణంలో తెరకెక్కిన ‘లోకా’ మూవీ మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చివర్లో దుల్కర్ క్యామియో ఉంటుంది. ‘లోకా’ నెక్స్ట్ పార్ట్‌లో దుల్కర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
ఐతే ఆ సినిమాలో అని చెప్పలేదు కానీ.. ‘లోకా’ ఫ్రాంఛైజీలో మమ్ముట్టి కూడా భాగం కానున్నాడని.. తామిద్దరం కలిసి తెరపై కనిపించనున్నామని దుల్కర్ వెల్లడించాడు. తండ్రి తనతో సినిమా చేయడానికి ఒప్పుకునేలా చేయడానికి తనకు 15 ఏళ్లు పట్టిందని.. ఇది ఊరికే వచ్చింది కాదని, తాను సంపాదించుకున్నదని దుల్కర్ తెలిపాడు. ‘లోకా’ సినిమాకు అనుకున్న దాని కంటే బడ్జెట్ రెట్టింపు అయిందని.. అది తెలిసి తన తండ్రి చాలా టెన్షన్ పడ్డాడని.. కానీ సినిమా ఎవ్వరూ ఊహించనంత పెద్ద హిట్టయిందని.. దీంతో మమ్ముట్టి ఎంతో సంతోషించి ఈ ఫ్రాంఛైలో భాగం కావడానికి అంగీకరించాడని దుల్కర్ చెప్పాడు.
This post was last modified on November 12, 2025 2:14 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…