ఈ నెల మొత్తంలో ఆంధ్రకింగ్ తాలూకా మినహాయించి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో మళ్ళీ రీ రిలీజులు క్యూ కడుతున్నాయి. కాకపోతే వీటిలో తప్పక చూడాల్సినవి, ఇంటరెస్టింగ్ అనిపించేవి కొన్ని ఉన్నాయి. మొదటిది ‘శివ’. నవంబర్ 14న సరికొత్త ఫోర్ కె ప్రింట్, డాల్బీ అట్మోస్ సౌండ్ తో రాబోతున్న ఈ కల్ట్ క్లాసిక్ ని ఆల్రెడీ మీడియా ప్రతినిధులు చూసి వావ్ అనుకున్నారు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కి ఇప్పటి తరం కూడా స్పెల్ బౌండ్ అవ్వడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ శివ రీ మాస్టరింగ్ వర్క్ మీద నాలుగేళ్ళకు పైగా కస్టపడి పని చేసింది. ఫలితం రావడమే తరువాయి.
ఒక రోజు తర్వాత సిద్దార్థ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ ఎమోషనల్ డ్రామాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, పరుచూరి సంభాషణలు రిపీట్ వేల్యూ తీసుకొచ్చాయి. త్రిష ఫ్యాన్ బేస్ పెరిగేందుకు దోహదపడిన సినిమాల్లో ఇది ఒకటి. నవంబర్ 21 చిరంజీవి ‘కొదమసింహం’ పునఃవిడుదల కానుంది. 1990లో మెగాస్టార్ తొలి కౌబాయ్ మూవీగా దీనికి చాలా ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేదు కానీ క్రమంగా కల్ట్ స్టేటస్ తెచ్చుకుని అభిమానులకు అత్యంత ఫేవరెట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది.
నవంబర్ 22 కార్తీ ‘ఆవారా’ వస్తోంది. గతంలో ఒకసారి షెడ్యూల్ చేసి వాయిదా వేశాక ఇప్పుడు తమిళ వెర్షన్ తో పాటు సమాంతరంగా విడుదల చేస్తున్నారు. నవంబర్ 28 సూర్య ‘సికందర్’ ఉంది. ఇది డిజాస్టరే కానీ సినిమా మొత్తాన్ని రీ ఎడిట్ చేసి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. నవంబర్ 29 మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’ వస్తోంది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ చేశారు కానీ స్టేట్ వైడ్ షోలు పడలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సో రెగ్యులర్ కొత్త రిలీజులతో పాటు ఈ పాతవి కూడా మూవీ లవర్స్ లుక్ వేయాలంటే పర్సుని కాస్త బరువుగా పెట్టుకోక తప్పదు.
This post was last modified on November 12, 2025 9:51 am
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…