సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని హీరోలను చేస్తుందో.. వైరల్ చేసి పడేస్తుందో అర్థం కాదు. ఒక నాలుగు రోజుల ముందు వరకు ‘గిరిజ ఓక్’ అంటే పెద్దగా పాపులరేమీ కాదు. ఆమె ఒక మరాఠీ నటి. సీరియళ్లతో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమిర్ ఖాన్ చిత్రం ‘తారే జమీన్ పర్’ సహా పలు చిత్రాల్లో ఆమె కనిపించింది. ఎక్కువగా ఆమె చేసింది క్యారెక్టర్, చిన్న స్థాయి కథానాయిక పాత్రలే. కానీ అప్పుడు రాని గుర్తింపు.. ఇప్పుడు కేవలం ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది.
స్కై బ్లూ శారీ, స్లీవ్ లెస్ వైట్ బ్లౌజ్‌తో చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్న తన లుక్‌కు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై క్యూట్‌గా చెప్పిన కబుర్లు కూడా నెటిజన్లకు విపరీతంగా నచ్చేస్తున్నాయి. తన వయసు ఇప్పుడు 37 ఏళ్లు కావడం విశేషం. కానీ యుక్త వయసులో ఉన్నపుడు కూడా రానంత ఫేమ్ ఈ ఒక్క ఇంటర్వ్యూతో వచ్చేసింది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ మాత్రమే కాదు.. గతంలో ఆమె నటించిన అనేక సినిమాల వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గతంలో నటించిన ఓ హిందీ సినిమాలో అతడికి జోడీగా గిరిజ ఓక్ నటించింది. ఇద్దరి మధ్య ఒక ఘాటైన లిప్ లాక్ సీన్ కూడా ఉండడం విశేషం. అది ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సందీప్ కిషన్ చాలా లక్కీ అంటూ అతణ్ని చూసి అసూయ చెందుతున్నారు కుర్రాళ్లు. ప్రస్తుతం గిరిజ ‘థెరపీ షెరపీ’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ‘కాంతార-చాప్టర్ 1’ ఫేమ్ గుల్షన్ దేవయ్యతో కలిసి తాను నటించిన ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్‌కు సంబంధించి తమ మధ్య జరిగిన సంభాషణ గురించి ఆమె చెప్పిన కబుర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి.
అలాగే ‘బేబ్స్’ అనే పదం గురించి ఆమె చెప్పిన క్యూట్ మాటలు కూడా తెగ నచ్చేస్తున్నాయి నెటిజన్లకు. గత నాలుగైదు రోజులుగా ఇండియన్ సోషల్ మీడియా అంతటా గిరిజనే ట్రెండింగ్‌లో ఉంది. ఈ వయసులో ఒక ఇంటర్వ్యూ ద్వారా తనకు ఇంత పాపులారిటీ వస్తుందని గిరిజ ఊహించి ఉండదేమో.
This post was last modified on November 11, 2025 2:25 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…