టాలీవుడ్ యువ కథానాయకుడు అల్లు శిరీష్ ఇటీవలే నయనిక అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అతడిది ప్రేమ పెళ్లి. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి అయినపుడు యంగ్ హీరో నితిన్ ఇచ్చిన పార్టీలో అతడి భార్య షాలిని ఫ్రెండ్ అయిన నయనికను చూడడం… వీళ్లిద్దరి పరిచయం తర్వాత ప్రేమగా మారడం.. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్థం చేసుకోవడం.. ఇదీ కథ.
ఐతే ఎంగేజ్మెంట్ సందర్భంగా శిరీష్ మెడలో నెక్లెస్ ధరించడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీని మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ కూడా నడిచింది. అవి శిరీష్ దృష్టికి కూడా వెళ్లాయి. తాను నెక్లస్ వేసుకోవడం మీద ఒక మీమ్‌ను షేర్ చేస్తూ అతను సరదాగానే ఆ మీమర్‌కు కౌంటర్ ఇచ్చాడు.
‘‘నెక్లస్‌కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డాణం పెట్టుకుంటే ఏమైపోతారో’’ అని రాసి ఉన్న మీమ్‌ను శిరీష్ షేర్ చేశాడు. తెలుగు మీమర్స్ భలే ఫన్నీ అని చెబుతూ.. తాను నెక్లస్ ధరించడంపై కౌంటర్ ఇచ్చాడు. వడ్డాణం మహిళలు మాత్రమే ధరిస్తారని.. కానీ మగవాళ్లు ఇలా నెక్లస్‌లు ధరించడం కొత్తేమీ కాదని ఉదాహరణలతో వివరించాడు శిరీష్. భారతీయ మహారాజులు, మొఘల్ చక్రవర్తులు ఇవి ధరించేవారని అతను చెప్పాడు.
సంబంధిత ఫొటోలు కొన్ని అతను పంచుకున్నాడు. గొప్ప చక్రవర్తిగా పేరున్న అక్బర్‌తో పాటు షాజహాన్, మహారాజా షేర్ సింగ్ మెడలో ఈ నెక్లస్‌లను ధరించారని.. మగవాళ్లు ఇవి వేసుకోరన్నది పాశ్చాత్త దేశాల నుంచి వచ్చిన అభిప్రాయం అని శిరీష్ పేర్కొన్నాడు. మొత్తానికి శిరీష్ బాగా రీసెర్చ్ చేశాకే ఆ నెక్లస్ ధరించాడని స్పష్టమవుతోంది. ట్రోల్స్, మీమ్స్ వస్తే ఏం చేయాలో కూడా అతను ప్రిపేరైనట్లే ఉన్నాడు.
This post was last modified on November 10, 2025 10:23 pm
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…