తెలుగులో ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాలో నటించిన తమిళ కథానాయిక గౌరి కిషన్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కలిసిన ఆమెను.. ఆర్.ఎస్.కార్తీక్ అనే సీనియర్ తమిళ సినీ జర్నలిస్టు అడిగిన ప్రశ్న దుమారం రేపింది. మీ బరువు ఎంత.. ఈ మధ్య వెయిట్ పెరిగినట్లున్నారే అని ఆ జర్నలిస్టు అడగ్గా.. నేనెందుకు నా వెయిట్ చెప్పాలి అంటూ ఆమె ఫైర్ అయింది.
ఇది అసలు జర్నలిజమే కాదంటూ ఆమె ఆ జర్నలిస్టుతో చాలా సేపు వాగ్వాదానికి దిగింది. ఆ జర్నలిస్టు కూడా గట్టిగానే ఎదురుదాడి చేశాడు. ఐతే సోషల్ మీడియా పూర్తిగా గౌరి వైపే నిలిచింది. ఇవేం ప్రశ్నలు అంటూ ఆ జర్నలిస్టు తీరును అందరూ దుయ్యబట్టారు. అలాంటి ప్రశ్నలు అడగడమే తప్పంటే.. మళ్లీ వాదించడమా అంటూ ఆయన్ని నిలదీశారు. ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ జర్నలిస్టు గౌరి కిషన్‌కు సారీ చెబుతూ ఒక వీడియో కూడా చేయాల్సి వచ్చింది.
కానీ బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆయన ఈ వివరణలో పేర్కొన్నాడు. దీంతో గౌరి కిషన్‌కు ఇంకా కోపం వచ్చింది. ఇదసలు క్షమాపణ లాగే లేదని.. దీన్ని తాను అంగీకరించనని ఆమె తేల్చి చెప్పింది. ఆయన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పడం.. బాడీ షేమింగ్ చేయలేదు అనడం.. అది సరదాగా అన్న ప్రశ్న అనడంపై ఆమె అభ్యంతరం వ్యక్త ంచేసింది.
ఇంకా బెటర్‌గా ట్రై చేయండి కార్తీక్ అంటూ ఘాటుగా బదులిచ్చింది గౌరి కిషన్. మరోసారి సోషల్ మీడియా ఆమె వైపే నిలిచింది. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఇలాగే స్పందిస్తుందని.. చేసిన తప్పుకి బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. ఇలాంటి వివరణ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం అని ఆ జర్నలిస్టుపై నెటిజన్లు మరోసారి ఫైర్ అవుతున్నారు.
This post was last modified on November 10, 2025 10:17 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…