ఏం టెన్షన్ పడకండి, టీమ్ ఆ పని మీద ఉందంటూ రాజా సాబ్ ప్రమోషన్ల గురించి తమన్ రెండు రోజుల క్రితం భరోసా ఇచ్చాడు కానీ ప్రస్తుతానికి ఏ కబురు లేక ఫ్యాన్స్ వెయిటింగ్ లోనే ఉన్నారు. నిజానికి నవంబర్ 14 లేదా 15 మొదటి లిరికల్ సాంగ్ వదలాలని అనుకున్నారు. కానీ ఆ రెండు రోజుల్లో వరసగా అఖండ 2 సాంగ్ లాంచ్, ఎస్ఎస్ఎంబి 29 రివీల్ ఈవెంట్ ఉన్నాయి. సో ట్రెండింగ్ పరంగా ఇబ్బందవుతుంది కాబట్టి వేరే ఆప్షన్ చూస్తున్నారని సమాచారం. అదేదో త్వరగా చేయమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దర్శకుడు మారుతీని అడుగుదామా అంటే ఈ మధ్య ఆయన బయట ఈవెంట్లలో కనిపించడం లేదు.
వీలైనంత త్వరగా గుడ్ న్యూస్ ని చెప్పడం చాలా అవసరం. ఒకపక్క మీసాల పిల్ల మొదటి పాట 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇంకోవైపు చికిరి చికిరి మూడు రోజులకే ఆ మార్కు అందుకొవడమే కాదు నార్త్ నుంచి సౌత్ దాకా ఒక ఫీవర్ లా పాకిపోయింది. లక్షల్లో రీల్స్ కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ లో రాజా సాబ్ హడావిడి జరగాలనేది ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక. కొన్ని నెలల క్రితమే తమన్ పాతవి వద్దని చెప్పి ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చాడు. వాటినే షూట్ చేశారు. సో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ డేట్, ముహూర్తం చెప్పకుండా ఇలా పదే పదే నానుస్తూ ఉంటే సహజంగానే జనాల్లో అసహనం వచ్చేస్తుంది.
జనవరి 9 కేవలం రెండు నెలల దూరంలో ఉంది. అదే రోజు రిలీజవుతున్న విజయ్ జన నాయకుడు నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. కానీ రాజా సాబ్ వైపు నుంచి సౌండ్ లేదు. ఎంత ప్రభాస్ హీరో అయినా పబ్లిసిటీని మరీ తేలికగా తీసుకోవడానికి లేదు. సలార్ లాంటి వాటికి ఎక్కువ హడావిడి చేసి ఉండకపోవచ్చు. వాటి కథ వేరు. కాంపిటీషన్ లేకుండా సోలోగా వచ్చి హిట్టు కొట్టాయి. కానీ రాజా సాబ్ కు ఈసారి అలాంటి సౌలభ్యం లేదు. పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పబ్లిసిటీ కీలక పాత్ర పోషించనుంది. పైగా ముంబై నుంచి హైదరాబాద్ దాకా ప్లాన్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on November 10, 2025 10:25 am
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…