Movie News

ప్ర‌భాస్ చేయ‌బోయేది రీమేకా?

ఓవైపు రాధేశ్యామ్ ఇంకా పూర్తి కాలేదు. మ‌రోవైపు ఆదిపురుష్‌తో పాటు నాగ్ అశ్విన్ సినిమా రెండూ కూడా భారీ ప్రాజెక్టులే. ప్ర‌భాస్ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయ‌డానికే రెండు మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టేలా ఉంది.

ఇంత‌లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా క‌మిట‌య్యాడ‌ని, దీని గురించే హోంబ‌లె ఫిలిమ్స్ ప్ర‌క‌ట‌న చేయ‌బోతోంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఐతే ప్ర‌భాస్‌కు ఇప్పుడింత తొంద‌రేంటి అనే సందేహాలు త‌లెత్తుతున్నాయి. ఐతే ప్ర‌శాంత్ ప్ర‌పోజ‌ల్ న‌చ్చే అత‌ను ఈ సినిమాకు ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌శాంత్-ప్ర‌భాస్ క‌ల‌యిక‌లో రాబోయేది కొత్త క‌థ కాద‌ట‌. అదొక రీమేక్ అని వార్త‌లొస్తున్నాయి.

ప్ర‌శాంత్ ఆరేళ్ల కింద‌ట ఉగ్రం అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. శ్రీ ముర‌ళి అనే చిన్న హీరోతో ప్ర‌శాంత్ తీసిన ఆ సినిమా క‌న్న‌డ నాట సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. గ్యాంగ్ వార్స్ నేప‌థ్యంలో సాగే ఆ చిత్రం చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. క‌న్న‌డ‌లో రొడ్డ‌కొట్టుడు సినిమాల మ‌ధ్య అది విభిన్న ప్ర‌య‌త్నంలో ప్ర‌శంస‌లందుకుంది.

ఈ సినిమాతో వ‌చ్చిన పేరు వ‌ల్లే కేజీఎఫ్ లాంటి భారీ సినిమా తీసే అవ‌కాశం ద‌క్కింది ప్ర‌శాంత్‌కు. ఇప్పుడు ఈ క‌థ‌ను ప్ర‌భాస్‌తో భారీ స్థాయిలో తీయాల‌న్న‌ది ప్ర‌శాంత్ ప్ర‌ణాళిక అట‌. ప్ర‌భాస్‌తో సినిమా అంటే దాని స్కేలే మారిపోతుంది. మూల క‌థ తీసుకుని దాన్ని పెద్ద రేంజిలో తీసి సినిమాకు కొత్త క‌ల‌ర్ ఇవ్వాల‌న్న‌ది ప్ర‌శాంత్ ప్ర‌య‌త్నంలా ఉంది.

క‌థ రెడీ కాబ‌ట్టి త‌న‌కు వీలున్న‌పుడు సినిమా చేద్దామ‌ని, ఇది త‌న‌కు భిన్న‌మైన సినిమా అవుతుంద‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడ‌ట‌. ఇంత‌కుముందు చివ‌ర‌గా ప్ర‌భాస్ చేసిన రీమేక్ మూవీ యోగి కూడా క‌న్న‌డ నుంచి వ‌చ్చిందే కావ‌డం విశేషం.

This post was last modified on December 1, 2020 9:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago