మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల వివాహం సందర్భంగా మెగా హీరోలందరూ డిసెంబర్ నెలలో షూటింగులకు ఎగనామం పెడుతున్నారు. చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ జనవరిలోనే మొదలు పెట్టాలని డిసైడ్ కాగా, రామ్ చరణ్ కూడా రాజమౌళిని అడిగి సంక్రాంతి వరకు సెలవులు తీసుకున్నాడట.
వరుణ్ తేజ్ తన సినిమా షూటింగులు సంక్రాంతి తర్వాత మొదలు పెట్టాలని ఫిక్సయ్యాడు. పవన్ కళ్యాణ్ పెళ్లి కోసం వెళ్లేది ఒక్క రోజే అయినా కానీ అంతవరకు షూటింగ్‍కి అయితే హాజరు కారాదని నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్ కూడా పుష్ప షూటింగ్‍కి కొద్ది రోజుల విరామం ఇచ్చి పెళ్లికొచ్చి తర్వాత మళ్లీ అడవులకి వెళతాడు.
సాయి ధరమ్ తేజ్ కూడా కొత్త సినిమాను జనవరిలోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కరోనా లాక్‍డౌన్ టైమ్‍లోనే పెళ్లయిపోయి వుంటే మెగా హీరోలంతా అందుబాటులో వుండేవారు. కానీ ఇప్పుడు నెల రోజులకు పైగా సెలవులతో ఇంత మంది హీరోలు ఒకేసారి అందుబాటులో లేకపోవడంతో పలు చిత్రాల షూటింగులు నిలిచిపోతాయి. ఎలాగో వచ్చే ఏడాది సినిమాల విడుదల తేదీల విషయంలో అనిశ్చితి నెలకొంది కనుక ఎవరూ అంత ఒత్తిడికి లోనవడం లేదు.
This post was last modified on December 1, 2020 4:52 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…