మెగా హీరోలంతా మూకుమ్మడి డుమ్మా!

మెగా ప్రిన్సెస్‍ నిహారిక కొణిదెల వివాహం సందర్భంగా మెగా హీరోలందరూ డిసెంబర్‍ నెలలో షూటింగులకు ఎగనామం పెడుతున్నారు. చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్‍ జనవరిలోనే మొదలు పెట్టాలని డిసైడ్‍ కాగా, రామ్‍ చరణ్‍ కూడా రాజమౌళిని అడిగి సంక్రాంతి వరకు సెలవులు తీసుకున్నాడట.

వరుణ్‍ తేజ్‍ తన సినిమా షూటింగులు సంక్రాంతి తర్వాత మొదలు పెట్టాలని ఫిక్సయ్యాడు. పవన్‍ కళ్యాణ్‍ పెళ్లి కోసం వెళ్లేది ఒక్క రోజే అయినా కానీ అంతవరకు షూటింగ్‍కి అయితే హాజరు కారాదని నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్‍ కూడా పుష్ప షూటింగ్‍కి కొద్ది రోజుల విరామం ఇచ్చి పెళ్లికొచ్చి తర్వాత మళ్లీ అడవులకి వెళతాడు.

సాయి ధరమ్‍ తేజ్‍ కూడా కొత్త సినిమాను జనవరిలోనే మొదలు పెట్టాలని డిసైడ్‍ అయ్యాడు. కరోనా లాక్‍డౌన్‍ టైమ్‍లోనే పెళ్లయిపోయి వుంటే మెగా హీరోలంతా అందుబాటులో వుండేవారు. కానీ ఇప్పుడు నెల రోజులకు పైగా సెలవులతో ఇంత మంది హీరోలు ఒకేసారి అందుబాటులో లేకపోవడంతో పలు చిత్రాల షూటింగులు నిలిచిపోతాయి. ఎలాగో వచ్చే ఏడాది సినిమాల విడుదల తేదీల విషయంలో అనిశ్చితి నెలకొంది కనుక ఎవరూ అంత ఒత్తిడికి లోనవడం లేదు.