లవ్, ఫ్రెండ్ షిప్స్ ఆధారంగా చేసుకుని సెన్సిబుల్ సినిమాలు ఇస్తాడని పేరున్న దర్శకుడు కిషోర్ తిరుమల కొత్త మూవీ రవితేజతో తీస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చాలా అంటే చాలా వేగంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి స్లాట్ మిస్ కాకూడదని కంకణం కట్టుకుని మరీ పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఇటీవలే రవితేజ మాస్ జాతర దారుణంగా ఫెయిలైన నేపథ్యంలో అంచనాల పరంగా ఇప్పుడా బరువంతా కిషోర్ తిరుమల మీదే పడుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ ని దాదాపు ఖరారు చేసిన ఈ ఎంటర్ టైనర్ కు మళ్ళీ భీమ్స్ సిసిరోలియోనే సంగీతం సమకూర్చడం విశేషం.
ఇక్కడ తిరుమల కిషోర్ ముందు కొన్ని సవాళ్లున్నాయి. మొదటిది రవితేజకు హిట్ ఇవ్వడం. రెండోది తీసుకున్నది వినోదాత్మక కాన్సెప్ట్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవడం. అందుకే ధమాకా తరహాలో ఒక మంచి జోష్ ఇచ్చే సాంగ్ ఇందులో పెట్టారని ఇన్ సైడ్ టాక్. పాపులర్ టీవీ సీరియల్స్ పాటలను తీసుకుని వాటిని రీమిక్స్ చేయించి కొత్త ప్రయోగం ఏదో చేశారట. ఇది కిషోర్ తిరుమల స్టైల్ కి భిన్నం. అయినా ఎందుకంటే రవితేజ హీరో కాబట్టి ఇలాంటి జోడింపులు తప్పనిసరి. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే పాత్రలో ఇండియా, ఫారిన్ రెండు చోట్ల కథ జరిగేలా కొంచెం డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఉంటుందట.
ఇక అసలైన మరో ఛాలెంజ్ తీవ్రంగా ఉన్న పోటీలో ఈ సినిమాని గెలిపించుకోవడం. కాంపిటీషన్ మాములుగా లేదు. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, జన నాయకుడు, పరాశక్తితో పోటీ చాలా టఫ్ గా ఉంది. అసలే రవితేజ వరస డిజాస్టర్ల తర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు. అలాంటప్పుడు సోలోగా అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది సంక్రాంతి బొమ్మని బలంగా నమ్ముతున్న హీరో నిర్మాత ఈ అవకాశాన్ని వదలుకునే ఆలోచనలో లేరట. దర్శకుడిగా కిషోర్ తిరుమల గత చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫెయిలయ్యింది. ఈ గాయం కూడా భర్త మహాశయులే తీర్చాలి.
This post was last modified on November 7, 2025 7:11 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…