యూత్ హీరో నిఖిల్ ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశాడు. తన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకుంది కానీ నెలలు దాటి సంవత్సరం అయిపోతున్నా ఇప్పటిదాకా విడుదల తేదీ ప్రకటించలేదు. మొన్నెప్పుడో అనౌన్స్ మెంట్ ఇస్తామనే రేంజ్ లో హడావిడి చేసి హఠాత్తుగా సైలెంటయ్యారు. దానికి సంబంధించిన ట్వీట్స్ మాయమైపోయాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించారు. షూట్ దాదాపుగా పూర్తయ్యిందంట కానీ విఎఫెక్స్ పనులు పెండింగ్ ఉండటం వల్ల వాయిదా పడుతోందట.
ఇదే సమస్య చిరంజీవి విశ్వంభరకు కూడా వచ్చింది. నిఖిల్ కు సాలిడ్ కంబ్యాక్ చాలా అవసరం. గత రెండు సినిమాలు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, స్పై దారుణంగా పోయాయి. ఎయిటీన్ పేజెస్ యావరేజ్ గా ఆడితే కార్తికేయ 2 ఒకటే సాలీడ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇది జరిగి మూడు సంవత్సరాలు దాటింది. ఒకపక్క కిరణ్ అబ్బవరం లాంటి చిన్న హీరోలు క్రమంగా దూసుకుపోతున్నారు. ఇంకోవైపు సీనియర్లు స్పీడ్ పెంచుతున్నారు. కానీ నిఖిల్ కు అనుకోకుండా చుట్టుముట్టిన చిక్కుల వల్ల స్వయంభుతో పాటు రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ జాప్యానికి గురవుతోంది.
వీటి సంగతలా ఉంచితే నిఖిల్ ఇలాంటి గ్రాండియర్లతో పాటు ఎంటర్ టైనర్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడటం అంత సేఫ్ అనిపించుకోదు. మీడియం బడ్జెట్ సినిమాలతోనూ ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దసరా లాంటి హై వోల్టేజ్ తర్వాత హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ మూవీ నాని ఎందుకు చేశాడంటే కారణం ఇదే. నిఖిల్ కూడా ఈ తరహా స్ట్రాటజీ ఫాలో కావాలి. యుద్ధలు, మంత్రతంత్రాలు, ఎప్పుడూ చూడని ప్రపంచాలు ఇలా పెద్ద సెటప్ తో రూపొందిన స్వయంభుని ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఆప్షన్ చూస్తున్నారట. ఎప్పుడు డిసైడ్ చేస్తారో మరి.
This post was last modified on November 7, 2025 5:56 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…