తమిళంలో స్టార్లు నటించే సినిమాలన్నీ తెలుగులో కూడా పెద్ద ఎత్తునే రిలీజవుతుంటాయి. తెలుగు మార్కెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకునే బడ్జెట్, బిజినెస్ లెక్కలు వేసుకుంటూ ఉంటారు అక్కడి నిర్మాతలు. ఐతే మిగతా అన్ని సీజన్లలో తమిళ చిత్రాలకు తెలుగులో రిలీజ్ పరంగా ఏ ఇబ్బందీ ఉండదు. మంచి రిలీజ్ దొరుకుతుంది. సినిమా బాగుంటే ఓపెనింగ్స్ కూడా వస్తాయి. కొన్ని చిత్రాలకు లాంగ్ రన్ కూడా ఉంటుంది. కానీ సంక్రాంతి సమయంలో మాత్రం తమిళ చిత్రాలకు ఇక్కడ స్కోప్ ఉండదు.
తెలుగు సినిమాకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి మన చిత్రాలకు థియేటర్లు సర్దుబాటు చేయడమే చాలా కష్టం. ఆ టైంలో తమిళ సినిమాలను ఇటు ట్రేడ్, అటు ప్రేక్షకులు లైట్ తీసుకుంటారు. ఒకట్రెండు సినిమాలు రిలీజైనా నామమాత్రమే. అందులోనూ 2026 సంక్రాంతికి తమిళ సినిమాల ఊసే వినిపించడం కష్టంగా ఉంది. కానీ తమిళంలో కూడా సంక్రాంతికి గట్టి పోటీ నెలకొనబోతోంది. ఆ చిత్రాలను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ.. ఫలితం ఉండకపోవచ్చు.
రాజాసాబ్, మన శంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు సంక్రాంతికి రావడం పక్కా. ఇంకా భర్తమహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి కూడా రేసులో ఉన్నాయి. వాటి విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. వీటికే థియేటర్ల సర్దుబాటు కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ సినిమాలకు ఏం స్క్రీన్లు, షోలు ఇస్తారు. జనవరి 9న రాజాసాబ్‌తో పాటు రిలీజ్ కానున్న విజయ్ మూవీ జననాయకుడుకు చెప్పుకోదగ్గ రిలీజ్ ఉండొచ్చు. అది కూడా మూడు రోజులే థియేటర్లలో ఉంటుంది. 12న మన శంకర వరప్రసాద్ వచ్చాక దాన్నీ పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత పోటీ తీవ్రమవుతుంది.
కాబట్టి తమిళంలో సంక్రాంతికి షెడ్యూల్ అయిన శివకార్తికేయన్-శ్రీలీల మూవీ ‘పరాశక్తి’కి తెలుగులో అస్సలు స్కోప్ ఉండకపోవచ్చు. శ్రీలీల తెలుగులో వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతోంది. ఆమెకు పరాశక్తి బ్రేక్ ఇస్తుందనే ఆశలు కలుగుతున్నాయి. గురు, ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాలు తీసిన సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉణ్నాయి. కానీ ‘పరాశక్తి’ తమిళంలో హిట్టయినా.. తెలుగులో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సంక్రాంతి తెలుగు సినిమాల మధ్య దీనికి థియేటర్లు దొరకవు. లేటుగా రిలీజ్ చేస్తే బజ్ రాదు. ఓ మంచి హిట్ అవసరమైన స్థితిలో ప్రామిసింగ్ సినిమాతో రాబోతున్నప్పటికీ.. పరాశక్తి సంక్రాంతి టైంలో రిలీజ్ కావడం శ్రీలీలకు మైనస్ అయ్యేలా ఉంది.
This post was last modified on November 7, 2025 2:59 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…